ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పవన్ కు రాజకీయంగా అన్యాయం చేస్తున్న చంద్రబాబు.. రామ జోగయ్య..

పవన్ కు రాజకీయంగా అన్యాయం చేస్తున్న చంద్రబాబు.. రామ జోగయ్య..

ఆంధ్రాలో ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాపు సంక్షేమ సేనను రద్దు చేసిన కాపు నేత హరి రామ జోగయ్య మరొక కొత్త సేనను స్థాపించారు. కాపు బలిజ సంక్షేమ సేనను స్థాపిస్తున్నట్లుగా ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులలో రాజ్యాధికారం చేపట్టే సత్తా ఉన్న నేత పవన్ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు.. ఇలా అందరినీ కలుపుకుంటూ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా తమ బలిజ సంక్షేమ సేన పనిచేస్తుందని హరి రామ జోగయ్య అన్నారు. ఈ నేపథ్యంగా ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కేవలం 21 సీట్లు ఇవ్వడం పై స్పందించారు. తక్కువ సీట్లు ఇచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా అన్యాయం చేస్తున్నారు అని ఆయన అభిప్రాయపడ్డారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :