ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సొంత పార్టీ కి భారీ విరాళాన్ని ఇచ్చిన పవర్ స్టార్..

సొంత పార్టీ కి భారీ విరాళాన్ని ఇచ్చిన పవర్ స్టార్..

రాజకీయ పార్టీలకు బయట వాళ్ళు విరాళాలు ఇవ్వడం మనం చూస్తుంటాం అయితే పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీకి భారీ మొత్తంలో విరాళాన్ని అందించారు. 10 కోట్ల రూపాయలు తాను సంపాదించిన డబ్బులను పార్టీకి విరాళంగా చెక్కు రూపంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో ఏవి రత్నంకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్.. స్వాతంత్ర సంగ్రామ సమయంలో నెహ్రు లాంటి గొప్ప నేతలు తమ కష్టార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని ప్రస్తావించారు. ఓ సదుద్దేశం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం.. రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తున్న జనసేన పార్టీకి తన వంతు విరాళంగా 10 కోట్ల రూపాయలు అందజేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి స్ఫూర్తినివ్వడం కోసం సినిమాల ద్వారా తాను సంపాదించిన డబ్బును.. ప్రభుత్వానికి న్యాయంగా పన్నులు కట్టిన తరువాతే పార్టీకి అందిస్తున్నట్లు తెలియపరచారు. కొందరు పవన్ కళ్యాణ్ చేసే పనిని మెచ్చుకుంటుంటే మరికొందరు అతను వైఖరి చూసి ఏమి మిగులుచుకోకుండా ఉండిపోతాడేమో అని జాలి పడుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :