ఆ సీన్ కోసం ఎంతో కష్టపడ్డా: మృణాల్
ఎంత హీరోహీరోయిన్లయినా వారిక కూడా అభిమాన నటీనటులుంటారు. వాళ్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. ప్రతి మూమెంట్ ను స్పెషల్ గా మార్చుకుంటూ ఆ క్షణాలను ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాము ఎంతో ఇష్టపడే నటుడిని సీన్ లో భాగంగా కొట్టాల్సి వస్తే? వారికెంత కష్టంగా ఉంటుందనేది ఊహించుకోగలం. టాలీవుడ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మృణాల్ కు ఇలాంటి అనుభవమే ఎదురైందట. మృణాల్ కు షాహిద్ కపూర్ అంటే ఇష్టమని తన కెరీర్ స్టార్టింగ్ నుంచే చెప్తూ వస్తుంది. అలాంటి ఆమెకు హిందీ జెర్సీలో ఆయనతో కలిసి నటించే ఛాన్సొచ్చింది. అందులో ఓ చోట హీరోను హీరోయిన్ చెంపదెబ్బ కొట్టే సీన్ ఉంటుంది.
ఆ సీన్ ను చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, తనకు ఆ సీన్ చాలా కష్టమైందని మృణాల్ చెప్పింది. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ రాగానే కథతో సంబంధం లేకుండా ఒప్పుకున్న మృణాల్ ఫస్ట్ డే షూటింగ్ లో ఆయన స్మైల్ చూస్తూ ఉండిపోయిందట. స్క్రీన్ పై ఎలా ఉన్నారో నిజంగా కూడా మీ నవ్వు అంతే బావుందని ఆయనకు చెప్పానని, షాహిద్ తో కలిసి నటించిన క్షణాలను మర్చిపోలేనని, షాట్ లో భాగంగా షాహిద్ ను కొట్టాల్సిన సీన్ తనవల్ల కాలేదని, లాస్ట్ కు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను గుర్తుచేసుకుని నన్ను కొట్టమని షాహిద్ జోక్ చేశాడని, అయినప్పటికీ ఆ సీన్ కోసం మూడు గంటలు టైమ్ తీసుకున్నట్లు మృణాల్ చెప్పింది.