ASBL NSL Infratech

బ్రహ్మానందం చేతుల మీదుగా 'పురుషోత్తముడు' మోషన్ పోస్టర్ లాంచ్ 

బ్రహ్మానందం చేతుల మీదుగా 'పురుషోత్తముడు' మోషన్ పోస్టర్ లాంచ్ 

శ్రీ శ్రీదేవి ప్రోడక్షన్స్ బ్యానర్‌లో రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'పురుషోత్తముడు'. జోవియల్ స్టార్ రాజ్ తరుణ్, హాసిని హీరోహీరోయిన్లుగా నటించిన ‘పురుషోత్తముడు’ మోషన్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బ్రహ్మానందం ఈ సినిమా  మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ నమస్కారం రమేష్ తేజావత్ నిర్మాణ సారధ్యంలో రామ్ భీమన దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం పురుషోత్తముడు. టైటిల్ చాలా బాగుంది కదూ. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జస్ట్ పోస్టర్ చూస్తుంటేనే సూపర్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా అద్భుతమైన విజయం సాదించాలని ఆ ఏడు కొండలవాడిని కోరుకుంటున్నాను అని అన్నారు.  

ఈ మూవీ రాజమండ్రిలో వేసిన భారీ సెట్లో టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా మూవీ డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయని అలాగే హీరో రాజ్ తరుణ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందిన భారీ చిత్రమిది సంగీత పరంగా కుడా పెద్ద హిట్ అవుతుంది అని చిత్ర దర్శకులు రామ్ భీమన అన్నారు.

ఇక అతి త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోందని నిర్మాతలు డా. రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ వెల్లడించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :