ASBL NSL Infratech

ఫ్యాన్ కు ఓటు వేస్తే.. మీ మెడకు ఉరే : చంద్రబాబు

ఫ్యాన్ కు ఓటు వేస్తే.. మీ మెడకు ఉరే : చంద్రబాబు

తాడేపల్లిలో పెద్ద సైకో, గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో వర్షంలో తడుస్తూనే చంద్రబాబు ప్రసంగించారు. రాజకీయ రౌడీలను తుంగలో తొకేస్తామని హెచ్చరించారు. గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట, 9 సార్లు ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్‌తో కలిపి 8 సార్లు టీడీపీ విజయం సాధించిందన్నారు. అమెరికాలో పనిచేసిన వ్యక్తి యార్లగడ్డ వెంకట్రావు. ప్రజలకు సేవ చేసేందుకు ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారని తెలిపారు. ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

నవరత్నాల పేరుతో జగన్‌ మోసం చేశారు.  ప్రజల ఆస్తులపై జగన్‌ ఫొటో ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తా. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు ఇస్తాం. వైసీపీ రెండో సారి అధికారంలోకి వస్తే మీ భూమి మీది కాదు. భూములు అమ్మాలన్నా, కొన్నాలన్నా జగన్‌ అనుమతి తీసుకోవాల్సిందే. ఆస్తులు  కొట్టేయడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులను టైటిల్‌ రిజిస్ట్రేషన్‌కు పెట్టారా లేదా? మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. ఫ్యాన్‌కు ఓటు వేస్తే.. మీ  మెడకు ఉరే. ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ వేధించింది. అందుకే ఉద్యోగుల్లో నూటికి 90 మంది కూటమికి ఓటేశారు అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :