ASBL NSL Infratech

ప్రపంచంలోనే హైదరాబాద్ అత్యంత నివాసయోగ్య ప్రాంతం : మేయర్ విజయ లక్ష్మి

ప్రపంచంలోనే  హైదరాబాద్ అత్యంత నివాసయోగ్య ప్రాంతం : మేయర్ విజయ లక్ష్మి

తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోనే అత్యంత నివాస యోగ్యమైన ప్రాంతంగా రూపొందిందని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో జరిగిన యునైటెడ్‌ నేషన్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఈవెంట్‌లో మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరంలో మరింతగా ఐటీ సంస్థల ఏర్పాటుకు ప్రపంచ దేశాలు మొగ్గుచూపడం ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు.  హైదరాబాద్‌లో విజయవంతమైన తెలంగాణ హరితహారం విశేషాలను వివరించారు. పచ్చని, పర్యావరణ అనుకూల నగరంగా మార్చడంతో పాటు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో జీహెచ్‌ఎంసీ వర్టికల్‌ గార్డెనింగ్‌, పర్యావరణ అనుకూల వ్యర్థపదార్థాల నిర్వహణ పద్ధతుల తో పాటు ప్రగతిశీల చర్యలు అమలు చేశామన్నారు. అంతర్జాతీయ ప్రముఖులు, విధాన నిర్ణేతలు, పర్యావరణవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :