ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో రామ్‌మందిర్‌ రథయాత్ర

అమెరికాలో రామ్‌మందిర్‌ రథయాత్ర

అమెరికా, కెనడాల్లో చేపట్టనున్న రామ్‌మందిర్‌ రథయాత్రను ఈ నెల 25న చికాగోలో ప్రారంభించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్‌ అమెరికా ( వీహెచ్‌పీఏ) తెలిపింది. మొత్తం 48 రాష్ట్రాల మీదుగా అరవై రోజులపాటు 8,000 మైళ్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. రథంలో సీతారాములు, లక్ష్మణ, హనుమాన్‌ విగ్రహాలతో పాటు అయోధ్య రామమందిర ప్రత్యేక ప్రసాదం, కలశం,  అక్షింతలు ఉంటాయని వీహెచ్‌పీఏ ప్రధాన కార్యదర్శి అమితాబ్‌ మిత్తల్‌ తెలిపారు. అమెరికాలో 851, కెనడాలో 150 ఆలయాలు ఈ సందర్భంగా సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ యాత్ర హనుమాన్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 23న ఇల్లినాయిస్‌లోని సుగర్‌ గ్రోవ్‌ దగ్గర ముగుస్తుందని తెలిపారు. హిందూ ధర్మంపై అవగాహన తీసుకురావడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని హిందూ మందిర్‌ ఎంపవర్‌మెంట్‌ కౌన్సిలుకు చెందిన తేజల్‌ షా అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :