ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సైలెంట్ గా ఫినిష్ చేసిన‌ ఇండియ‌న్

సైలెంట్ గా ఫినిష్ చేసిన‌ ఇండియ‌న్

శంక‌ర్- క‌మ‌ల్ హాస‌న్ కాంబోలో వ‌చ్చిన ఇండియన్ సినిమా క్రియేట్ చేసిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఇప్పుడు పాతికేళ్ల త‌ర్వాత ఈ సినిమా సీక్వెల్ చేయ‌డానికి కుదిరింది. ఏ ముహూర్తాన ఇండియ‌న్2 స్టార్ట్ అయిందో కానీ సినిమా పూర్త‌వ‌డానికి నానా ఇబ్బందులు ఎదురయ్యాయి. సెట్స్ లో క్రేన్ ప్ర‌మాదం వ‌ల్ల ఆగిన షూటింగ్, రెండేళ్ల త‌ర్వాత పునఃప్రారంభించారు.

ఈ లోపు శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ ను స్టార్ట్ చేయ‌డం, మ‌ళ్లీ ఇండియ‌న్2ను రీస్టార్ట్ చేయాల్సి రావ‌డం వ‌ల్ల గేమ్ ఛేంజ‌ర్ ను ప‌క్క‌కు పెట్టి మరీ శంక‌ర్ ఇండియ‌న్2 మీద ఫోక‌స్ చేయ‌డం లాంటివి చాలానే జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కు కొన్ని నెల‌ల క్రితం ఇండియ‌న్ 2 షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ మొద‌ల‌య్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క‌మ‌ల్ హాస‌న్ ఇంట్రెస్టింగ్ విష‌యాన్నివెల్ల‌డించాడు. తాము ఇన్ని రోజులు కేవ‌లం ఇండియన్2 షూటింగ్ మాత్ర‌మే చేయ‌లేద‌ని, ఇండియ‌న్3 కి కూడా ఒకేసారి షూటింగ్ జ‌రిపిన‌ట్లు వెల్ల‌డించాడు. ఏవో కొన్ని సీన్లు కాకుండా ఇండియ‌న్3 మొత్తాన్ని పూర్తి చేసిన‌ట్లు క‌మ‌ల్ తెలిపాడు. ఇండియ‌న్2 రిలీజ్ త‌ర్వాత ఇండియ‌న్3కు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ మొద‌ల‌వుతాయ‌ని, ఎక్కువ గ్యాప్ లేకుండా రెండు సినిమాలు రిలీజ్ అవుతాయ‌ని ఆయ‌న చెప్పారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :