ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హారిస్‌బర్గ్‌ తెలుగు సంఘం 

హారిస్‌బర్గ్‌ తెలుగు సంఘం 

హారిస్‌బర్గ్‌ తెలుగు సంఘం (హెచ్‌టిఎ) తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమా లను జరుపుకోవడానికి ఏర్పాటు చేసిన సంస్థ. సెంట్రల్‌ పెన్సిల్వేనియాలోని తెలుగు వారందరిని ఒకచోట చేర్చి విభిన్న కార్యకలాపాల ద్వారా వారందరిని ఏకం చేస్తోంది. అందులో భాగంగా  ప్రతి సంవత్సరం ఉగాది, దసరా, బతుకమ్మ వంటి ఉత్సవాలను అసోసియేషన్‌ తరపున నిర్వహించి స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ అద్భుత వేడుకలు పిల్లల, పెద్దల నృత్య, గాన, ఫ్యాషన్‌ షో, నాటికలు, మరియు కవి సమ్మేళనాలతో  నిండి అందరికీ ఆనందాన్ని పంచి, వేడుకకు ఒక అందాన్ని, ఆనందాన్ని తీసుకు వస్తున్నాయి. ఈ వేడుకలు అన్నింటి ద్వారా మన సంస్కృతిని, సంప్రదాయా లను సజీవంగా ఉంచటానికి, వాటి గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయటానికి మా వంతు కృషి చేస్తున్నాము. మహిళల కోసం ప్రత్యేకంగా మదర్స్‌ డే ఈవెంట్‌ - వినోదం, డ్యాన్స్‌లను, షాపింగ్‌ ను మిళితం చేస్తూ ఒక మంచి కార్యక్రమము నిర్వహిస్తున్నాము.

ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన ధనాన్ని ప్రతీ సంవత్సరమూ ఒక మంచి సాంఘిక సంస్థకు బహుకరిస్తున్నాము. వేసవిలో నిర్వహించే పికిల్‌ బాల్‌, టెన్నిస్‌, వాలీబాల్‌తో సహా బహిరంగ కార్యకలా పాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే కాకుండా సభ్యుల మధ్య స్నేహ భావాన్ని పెంపొంది స్తోంది.  వేసవిలో వన విహారయాత్రను జరుపుకోవడం, క్రీడా విజేతలకు బహుమతులు పంపిణీ చేయడం జరుగుతుంది.  ఫుడ్‌ డ్రైవ్‌లు, రక్తదాన శిబిరాలు మరియు రోడ్‌ క్లీన్‌-అప్‌ల వంటి సామాజిక సేవల ద్వారా సమాజానికి మనవంతు సేవకి %నుA% నిబద్ధతతో కృషి చేస్తోంది. ప్రస్తుతం అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా శ్రీధర్‌ నాగమల్ల వ్యవహరిస్తున్నారు.

రెండు దశాబ్దాలకు పైగా హారీస్‌బర్గ్‌ లోని తెలుగు కమ్యూనిటీకి హెచ్‌టిఎ సాంస్కృతిక సేవలందించడంతోపాటు కొన్ని కార్యక్రమాలను కమ్యూనిటీకి ప్రయో జనం కలిగించేవిగా చేస్తోంది. అడాప్ట్‌ హైవే, సమ్మర్‌ పిక్నిక్‌, సంగమం, ఫుడ్‌ డ్క్రెవ్‌ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాల్లో కూడా ఎంతోమంది పాల్గొని హెచ్‌టిఎ చేస్తున్న సేవకు తోడ్పాటును అందిస్తున్నారు. మా హేరీస్‌బర్గ్‌ కార్యక్రమా లను ఎప్పటికప్పుడు ప్రచురిస్తున్న తెలుగు టైమ్స్‌కు 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :