ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పీఏ అరెస్టుపై హరీష్ రావు కార్యాలయం కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే..

పీఏ అరెస్టుపై హరీష్ రావు కార్యాలయం కీలక ప్రకటన.. ఏం చెప్పిందంటే..

మాజీ మంత్రి హరీశ్ రావు వద్ద పీఏగా పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కాజేశారన్న ఆరోపణలను ఖండిస్తూ హరీశ్ రావు కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఈ ఆరోపణల్లో నిజం కాదని స్పష్టం చేసింది. "హరీశ్ రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాజేశాడనే ప్రచారాన్ని ఖండిస్తున్నాం. వాస్తవం ఏంటంటే నరేష్ అనే వ్యక్తి హరీశ్ రావు వద్ద పీఏ కాదు. అతను ఒక కంప్యూటర్ ఆపరేటర్‌గా, తాత్కాలిక ఉద్యోగిగా హరీశ్ కార్యాలయంలో పనిచేసేవారు. మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత 06-12-2023 రోజున కార్యాలయ సిబ్బందిని పంపేశాం. ఆ రోజు నుంచి నరేష్‌తో కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. అనుమతి లేకుండా కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేష్ తన వెంట తీసుకువెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే మా కార్యాలయం స్పందించి, అతనిపై 17-12-2023న నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాం. కాబట్టి, ఆ వ్యక్తితో హరీశ్ రావుతో గానీ, కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ వాస్తవాలు గుర్తించకుండా తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సాయం చేశాం. వాస్తవాలు గుర్తించాలని కోరుతున్నాం"అని సదరు ప్రకటనలో పేర్కొంది.

విషయం ఏంటంటే..
తెలంగాణ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పీఏ జోగుల నరేష్ ను జూబిలీ హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్ తో సహ మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్‌మాల్ కేసులో వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఆరెస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న జోగుల నరేష్ తో పాటు కొర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకార్ లు అరెస్టయ్యారు.


అరెస్టు ఎందుకు చేశారంటే..
మెదక్ జిల్లాకు చెందిన దూమ రవి నాయక్ భార్య గతంలో పొలం పనులు చేస్తుండగా పాముకాటుకు గురైంది. సంగారెడ్డిలోని ఓ హాస్పిటల్లో ఆమెకు రవి నాయక్ ప్రాథమిక చికిత్స చేయించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాడు. అయితే, ఆమె చికిత్స పొందుతూ నవంబర్ 6న మరణించింది. భార్య ఆస్పత్రి ఖర్చుల కోసం దాదాపు రూ.5 లక్షల ఖర్చు చేసిన రవి నాయక్.. భార్య మరణానంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ నెలలు గడుస్తున్నా.. సీఎం రిలీఫ్ ఫండ్‌ డబ్బులు రాలేదు. ఈ విషయంపై రవి నాయక్ సీఎంఓలో సంప్రదించగా.. అసలు రహస్యం బయటపడింది. 

సీఎంఓ చెక్కుల స్కాం: 
అసలు స్కాం ఏంటంటే.. సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు అందకపోవడంతో రవి నాయక్ సీఎంఓలో సంప్రదించగా సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎప్పుడో విడుదలైపోయాయని సీఎంఓ వర్గాలు తెలిపాయి. అయితే రవి బదులుగా జోగు నరేష్ కుమార్ అనే వ్యక్తి ఆ చెక్కులు అందుకున్నట్లు సీఎంఓ వెల్లడించింది. దీంతో తాను మోసపోయానని గుర్తించిన రవి నాయక్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో జోగుల నరేష్ తో పాటు కొర్లపాటి వంశీ, వెంకటేష్ గౌడ్, ఓంకార్ లు ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై U/s 417, 419, 420, 120(b) r/w 34 IPC, సెక్షన్ 66(B) & 66(C) IT యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :