వయొలెన్స్ తో రెచ్చిపోయిన గోదావరి గ్యాంగ్
గామి సినిమాతో ఈ ఏడాది ఇప్పటికే ఒక మంచి సక్సెస్ అందుకున్న విశ్వక్సేన్ ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మే 17న ఈ సినిమా రిలీజ్ కానుంది. గతేడాది డిసెంబర్ నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఫైనల్ గా ఇప్పటికి ఈ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుందీ సినిమా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, సితార బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది.
రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజైంది. గోదావరి ప్రాంతంలో పగలు రాజ్యమేలిన కాలంలో ఒక్కసారి కత్తి పడితే దానికే బలవ్వాలనే మనస్తత్వాలు రక్తపాతాన్ని సృష్టిస్తాయి. మంచోడనే చెడ్డ పేరు తనకొద్దని తిరిగే విశ్వక్సేన్ కి సొంత వాళ్లే శత్రువులవుతారు. దీంతో అమ్మోరు పూనినట్లు ఓ రాత్రి విలయతాండవం చేసి తెగ నరుకుతాడు. ఇంతకీ అసలు అక్కడ కక్షలకు, పగలకు పునాది వేసిందెవరు అనేది తెరపైనే చూడాలి.
ట్రైలర్ లో ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. టీజర్ మాత్రం ఇంప్రెస్సివ్ గానే ఉంది. పక్కా పల్లెటూరి క్యారెక్టర్ లో విశ్వక్సేన్ కొత్తగా కనిపించడంతో పాటూ బాగా వయొలెంట్ గా కూడా కనిపిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను హైలెట్ చేస్తుంది. అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ లో వస్తున్న మాస్ సినిమా కావడంతో ఈ సినిమాకు ఇది గోల్డెన్ ఛాన్సే అని చెప్పాలి.