ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీడీపీకి వాలంటీర్ల టెన్షన్.! ఉద్యోగాలు సేఫ్ అంటూ భరోసా..!!

టీడీపీకి వాలంటీర్ల టెన్షన్.! ఉద్యోగాలు సేఫ్ అంటూ భరోసా..!!

ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాటికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థను రూపొందించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేలా.. వాళ్ల ద్వారా అన్ని పనులూ ఇళ్ల వద్దే జరిగేలా యంత్రాంగాన్ని తీర్చిదిద్దారు. ఇది సూపర్ సక్సెస్ అయింది. ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వ పథకాలను అందిస్తుండడంతో లబ్దిదారులు సంతోషంగా ఉన్నారు. అయితే ఈ వాలంటీర్లను వైసీపీ దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పట్టు కలిగి ఉండడంతో వాళ్లను దూరం చేసుకోవడం కూడా వాటికి ఇబ్బందిగా మారింది.

వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చేతూ శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై వాలంటీర్లంతా మండిపడుతున్నారు. తన నియోజకవర్గంలో పనిచేసే కొంతమంది వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ఆ కామెంట్స్ చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా సంఘటితమై ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. వాలంటీర్లకు మద్దతుగా వైసీపీ నేతలు కూడా స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది.

వాలంటీర్లపై సుధీర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఉచ్చులో పడొద్దని సూచించారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు ఇస్తామని.. మంచి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయబోమని గతంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ను ఆయన గుర్తు చేశారు. అదే సమయంలో వైసీపీ చెప్పినట్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనే వాలంటీర్లను టీడీపీ సమర్థించబోదని స్పష్టం చేశారు.

మరోవైపు చంద్రబాబు కూడా వాలంటీర్లకు మరిన్ని వరాలు కురిపించారు. వైసీపీ నేతలు ట్రాప్ లో పడి వాలంటీర్లు భవిష్యత్తును కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్ చేసిన వాళ్లు కూడా ఐదు వేలకు వాలంటీర్లుగా పని చేయడాన్ని తాను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే మీకు హోదా కలిగిన ఉద్యోగాలు కల్పిస్తామని.. అలాగే ఉద్యోగ భద్రత కూడా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్కిల్స్ డెవలప్ చేయించి నెలకు కనీసం 30 నుంచి 50వేలు అందేలా తాను చూస్తానని మాటిచ్చారు. వైసీపీ ట్రాప్ లో పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని సూచించారు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉన్న వాలంటీర్లను ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ తంటాలు పడుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :