ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యువత భవితకు బాధ్యత నాది.. చంద్రబాబు

యువత భవితకు బాధ్యత నాది.. చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ప్రత్యేకంగా యువతతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వాలంటీర్ వ్యవస్థపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థులు కూడా వాలంటీర్ వ్యవస్థకు అలవాటు పడిపోతున్నారని.. ఇది భావితరాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని ఆయన అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదు అని స్పష్టం చేసిన చంద్రబాబు.. ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కూడా ఇలా వాలంటీర్లుగా స్థిరపడిపోవడం బాధాకరంగా ఉంది అని అన్నారు. ఇవాళ 5000 జీతం తీసుకుంటున్న యువతకు కనీసం నెలకి 30 నుంచి 50 వేల వరకు సంపాదించే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నామని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువత జీవితాలలో బంగారు భవిత తీసుకువచ్చే బాధ్యత తనది అని స్పష్టం చేశారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :