ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

2020 నవంబర్ లో నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైంది

2020 నవంబర్ లో నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైంది

రాజకీయ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు బీజేపీ నేత రఘునందన్‌ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు.  దుబ్బాక, హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్‌ ట్యాప్‌ చేశారు. ఇదే మాట నేను ఉప ఎన్నిక సమయంలో చెప్పాను. 2020 నవంబర్‌లో నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైంది. గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్‌ ప్రమేయం లేకుండా పోలీసులు ఫోన్‌ ట్యాప్‌ చేయలేరు. ఈ కేసులో తొలి ముద్దాయిగా కేసీఆర్‌, రెండో ముద్దాయిగా హరీష్‌ రావు, మూడో ముద్దాయిగా అప్పటి సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని చేర్చాలి.  కల్వకుంట్ల కుటుంబానికి ఇందులో ముఖ్య పాత్ర ఉంది. ఒక్కో కేసుకు ఒక్కో ఎఫ్‌ఐఆర్‌ నమోదు  చేయాలని డీజీపీని కోరాను. పారదర్శకంగా విచారణ చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని తెలిపారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :