ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా)

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా)

బే ఏరియాలోని తెలుగువాళ్ళకోసం ఏర్పడిన సంస్థ బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థను కొందరు పెద్దలు ఆరోజుల్లో తెలుగువారి వేదికగా, తెలుగు సంస్కృతికి ప్రతీకగా ఉంచేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. బాటా ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇటీవలనే గోల్డెన్‌ జూబ్లి వేడుకలను బాటా అంగరంగ వైభవంగా నిర్వహించింది. తెలుగు భాషకు పట్టం కట్టేలా కార్యక్రమాలు, తెలుగు సంస్కృతిని తెలియజెప్పేలా నాటకాలు, కార్యక్రమాలను బాటా ప్రతి వేడుకల్లోనూ ఏర్పాటు చేస్తోంది. ఉగాది, సంక్రాంతి, దీపావళి వంటి పెద్ద వేడుకలతోపాటు ఇతర వేడుకలను కూడా బాటా నిర్వహిస్తోంది.

అన్నమయ్య సంకీర్తనలు, తమన్‌, ఎస్‌పిబి, దేవిశ్రీ ప్రసాద్‌ వంటి ప్రముఖులతో సంగీత విభావరి, అవధానాలు, మహిళా కార్యక్రమాలు, చిన్నారుల ప్రతిభకు పదును పెట్టేలా పోటీలు, నలభీమ వంటల పోటీలు, ముగ్గుల పోటీలు ఇలా ఎన్నో రకాల పోటీలు, కార్యక్రమాలతో బాటా నాటి నుంచి నేటి వరకు ఎంతోమందిని అలరిస్తూ వస్తోంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు చిన్నారులకోసం బాటా తొలుత తెలుగు టైమ్స్‌తో కలిసి పాఠశాలను ఏర్పాటు చేసి తెలుగు భాషను నేర్పిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ పాఠశాలను తానా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకుంటున్న చిన్నారులతో బాటా కార్యక్రమాల్లో సాంస్కృతిక నాటకాలను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇప్పుడు బాటా సంస్థకు అధ్యక్షునిగా కొండల్‌రావు కొమరగిరి వ్యవహరిస్తు న్నారు. కమిటీ సభ్యుల సూచనలతో, మీ అందరి సహాయ సహకారములతో ఘనమైన తెలుగు భాషా సంస్కృతులను - చేపట్టబోయే సాంస్కృ తిక, సామాజిక, సేవా కార్యక్రమముల ద్వారా బాటాను విస్తరింప జేస్తానని చెప్పారు.   

ఘనమైన తెలుగుభాషా సంస్కృతులను తన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్న బాటా ద్వారా భవిష్యత్తు తరం కూడా మన సంస్కృతీ, సంప్రదాయాలు, తెలుగు భాషను మరిచిపోకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో జరుగుతున్న కార్యక్రమాల్లో యువతను, పిల్లలను భాగస్వాములను చేస్తున్నా ము. కార్యక్రమాలే కాకుండా ఆటల పోటీల్లో, సేవా కార్యక్రమాల్లో కూడా వారు పాలుపంచుకునేలా ప్రణాళికలతో ముందుకెళుతున్నాము. బాటా 44 సంవత్స రాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నదంటే అందుకు కారణం బే ఏరియాలో ఉన్న మన తెలుగువారు అందిస్తున్న సహాయసహకారాలతో పాటు బాటా పూర్వ అధ్యక్షులందరూ సమిష్టిగా పని చేయడమే అని.. అదే బాటా ప్రత్యేకత! తెలుగు కమ్యూనిటికీ పత్రిక, పోర్టల్‌, యూట్యూబ్‌ ద్వారా మీడియా సేవలు అందిస్తున్న తెలుగుటైమ్స్‌కు వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :