ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

లెజెండ్ రీ రిలీజ్.. మరొకసారి హిస్టరీ రిపీట్ అవుతుందా..

లెజెండ్ రీ రిలీజ్.. మరొకసారి హిస్టరీ రిపీట్ అవుతుందా..

2024 ఎన్నికలకు ముందు మరొకసారి 2014 ఎన్నికల సమయాన్ని గుర్తు చేయడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంటూ అఖండ, వీరసింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన బాలయ్య సినీ ప్రేక్షకుల మనసులో ఓ ఎమోషన్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఓ పక్క రాజకీయాలలో తన వంతు పాత్ర పోషిస్తూ ఇటు సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ నట సింహం. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో తిరిగి మరొకసారి లెజెండ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 30న ఈ చిత్రం తిరిగి మరొకసారి మాస్ భీభత్సం సృష్టించడానికి సిద్ధమవుతోంది. 2014లో లెజెండ్ సినిమా రిలీజ్ అవ్వడం.. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అవ్వడం.. బాలయ్య బాబు ఎమ్మెల్యే అవ్వడం.. ఇలా టీడీపీ కు అన్ని కలిసి తిరిగి అదే చరిత్ర రిపీట్ చేయడానికి ఎన్నికల సమయంలో మరొకసారి లెజెండ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :