ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో

నంద‌మూరి ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో

సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత నంద‌మూరి ఫ్యామిలీ నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్ల‌లో బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. తార‌క ర‌త్న కూడా కొన్ని సినిమాలు చేశాడు. ఈ మ‌ధ్యే చైత‌న్య కృష్ణ బ్రీత్ అంటూ ఏదో ట్రై చేశాడు కానీ ఆ సినిమాకు ఆశించిన రిజ‌ల్ట్ ద‌క్క‌లేదు. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌దేళ్ల కింద‌ట యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన జాన‌కి రామ్ పెద్ద కొడుకు తార‌క రామారావును హీరోగా ప‌రిచ‌యం చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఈ బాధ్య‌త‌ల‌ను వైవిఎస్ చౌద‌రి తీసుకున్న‌ట్లు స‌మాచారం. చౌద‌రి ఇప్పుడు ఫామ్ లో లేక‌పోయినా దేవ‌దాసు రూపంలో హీరో రామ్ కి డెబ్యూతోనే సిల్వ‌ర్ జూబ్లీ హిట్ ఇచ్చాడు.

కానీ సాయి తేజ్ తో తీసిన రేయ్, ర‌వితేజ‌తో చేసిన నిప్పు లాంటి సినిమాలు డిజాస్ట‌ర్ల‌వ‌డంతో డైరెక్ష‌న్ కు దూరంగా ఉన్నాడు చౌద‌రి. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత జానకిరామ్ అబ్బాయిని ప‌రిచ‌యం చేయ‌డం కోసం ఓ యూత్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ట్రెండ్ కు త‌గ్గట్టు చౌద‌రి తార‌క రామారావును ప్రెజెంట్ చేస్తాడా లేదా అన్న‌దే డౌట్. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాలేదు. అన్నీ ఓకే అనుకున్న త‌ర్వాత సినిమాను అనౌన్స్ చేద్దామ‌నుకుంటున్నార‌ట‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :