ASBL NSL Infratech

అందాల పోటీల్లో తొలిసారి... 60 ఏళ్ల భామ కు

అందాల పోటీల్లో తొలిసారి... 60 ఏళ్ల భామ కు

అందాల పోటీల్లో అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌ సరికొత్త చరిత్ర షృష్టించారు. ఆరు పదుల వయసులో అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ భామ తాజాగా మిస్‌ యూనివర్స్‌ ప్రాతినిధ్యం కోసం జరుగుతున్న పోటీల్లో కిరీటం దక్కించుకున్నారు. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఇందులో లా ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్‌ ఎయిర్స్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. మృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్టు అయిన అలెజాండ్రా సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించారు. అందానికి సరికొత్త నిర్వచనమిచ్చారు. ఈ ఏడాది మే నెలలో జరగబోయే  మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా పోటీల్లో ఈమె బ్యూనస్‌ ఎయిర్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే విశ్వసుందరి 2024 పోటీల్లో తన దేశం తరపున పాల్గొంటారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :