ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ హీరో...

టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ హీరో...

బాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో వరుణ్ ధావన్ ఒకరు. రీసెంట్ గా భేధియా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు ఈ హీరో. తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేసారు. తెలుగు సినిమాలు వరుసగా బాలీవుడ్ లో డబ్ అయ్యి రిలీజ్ అవుతుండగా అక్కడ సినిమాలు కూడా తెలుగులో డబ్ చేసి ఇక్కడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తోడేలు తెలుగులో అంతగా హిట్ టాక్ సొంతం చేసుకోకపోయినా , ఆ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ ధావన్ హైదరాబాద్ రావడం ఇక్కడ ఆడియన్స్ ని మీట్ అవ్వడం సందడిగా జరిగింది.

తోడేలు సినిమాని టాలీవుడ్ లో గీత ఆర్ట్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఇక్కడ ఒక రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ టైమ్ లోనే వరుణ్ తో స్ట్రైట్ తెలుగు సినిమాని గీత ఆర్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. వరుణ్ ధావన్ కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చూసేందుకు ఆసక్తి చూపించారు. గీతా ఆర్ట్స్ లోనే వరుణ్ ధావన్ తెలుగు సినిమా ఉంటుందని టాక్. ఇప్పటికే ఈ సినిమాపై చర్చలు మొదలు పెట్టారట. ఈ విషయాన్ని వరుణ్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు.

త్వరలో ఒక తెలుగు మూవీ చేయబోతున్నాను. దానికి సంబంధించిన విషయాలు కొద్దిరోజుల్లో తెలియచేస్తామని అన్నారు. తెలుగు హిందీ భాషల్లో కలిసి వచ్చేలా ఆ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇంతకీ వరుణ్ ధావన్ తో చేసే సినిమాకు దర్శకుడు ఎవరన్నది తెలియాల్సి ఉంది. వరుణ్ ధావన్ ని తెలుగులో గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు అల్లు అరవింద్. టాలీవుడ్ లోన్ సైతం తన మార్క్ ని చూపించడానికి హీరో వరుణ్ ధావన్ రెడీ అవుతున్నారట.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :