ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వంశీరామ్ బిల్డర్స్ ఆధ్వర్యంలో టెక్ పార్కులు

వంశీరామ్ బిల్డర్స్ ఆధ్వర్యంలో టెక్ పార్కులు

హైదరాబాద్‍లో ఐటీ కంపెనీల కోసం కొత్తంగా రూ.2,000 కోట్లతో వంశీరామ్‍ బిల్డర్స్ మూడు టెక్‍ పార్కులను అభివృద్ధి చేస్తోంది. నానక్‍రామ్‍గూడలోని ఫైనాన్షియల్‍ జిల్లాలో జ్యోతి టెక్‍ పార్కు పేరుతో 16.5 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని, ఎస్‍డీ టెక్‍ పార్కు పేరుతో 11 లక్షల చ.అ. కార్యాలయ స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నామని వంశీరామ్‍ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్‍ డైరెక్టర్‍ ఎస్‍బీ రెడ్డి తెలిపారు. జ్యోతి గ్రాన్యూల్స్ పేరుతో కొండాపూర్‍లో 6.5 లక్షల చ.అ టెక్‍ పార్కును కూడా చేపట్టింది. ఇవన్నీ నాన్‍ ఎస్‍ఈజెడ్‍ ప్రాజెక్టులే. ఐటీ పార్కుల అభివృద్ధిలో భాగంగా సోహినీ టెక్‍ పార్కు పేరుతో ఐటీ పార్కును కంపెనీ అభివృద్ధి చేసింది. ఇందులో మైక్రోసాఫ్ట్, వన్‍ప్లస్‍ వంటి కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. బీఎస్‍ఆర్‍ ఐటీ ఎస్‍ఈజెడ్‍ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో బ్లాక్‍-1 ను పూర్తి చేశామని ఇందులో మెడ్‍ట్రానిక్‍ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. ఇందులో 15 లక్షల చ.అ. కార్యాలయం స్థలం ఉండగా 1.5 లక్షల చ.అ స్థలంలో మెడ్‍ట్రానిక్‍ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకింగ్‍, ఇన్సూరెన్స్ అండ్‍ ఫైనాన్సియల్‍ సేవల రంగంలోని మరో బహుళ జాతి కంపెనీ కూడా కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది. మరిన్ని బహుళ జాతి కంపెనీలు కార్యాలయ స్థలం కోసం చర్చలు జరుపుతున్నట్లు ఎస్‍బీ రెడ్డి తెలిపారు. 13 లక్షల చ.అ కార్యాలయ స్థలంతో అధారిత రెసిడెన్సియల్‍ టౌన్‍షిప్‍లు, కమర్షియల్‍ ప్రాజెక్టులను కూడా కంపెనీ అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :