ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడు : అమెరికా మంత్రి ప్రశంసలు

ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడు : అమెరికా మంత్రి ప్రశంసలు

మంత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడంటూ ఆకాశాన్నికెత్తేశారు. న్యూఢిల్లీలోని ఇండియా హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తన భారత పర్యటన గురించి ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ మధ్య నేను ఇండియాకు వచ్చి వెళ్లాను. హోలీ వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే భారత్‌లో దిగాను. ఆ సమయంలో మోదీతో సమావేశమయ్యే అద్భుత అవకావం దక్కింది. ఆయన నమ్మశక్యం కాని దార్శనికుడు, ప్రజలపై ఆయనకు ఉన్న నిబద్ధత మాటల్లో వర్ణించలేం. ప్రజలకు పేదరికం నుంచి బయట పడేయాలని, భారత్‌ను ఒక ప్రపంచ శక్తిగా ముందుకు నడిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది వాస్తవ రూపం దాలుస్తోంది అని ఆమె ప్రసగించారు. కాగా, భారత్‌, అమెరికా మధ్య బలపడుతున్న దౌత్య బంధానికి అమెరికా మంత్రి వ్యాఖ్యలు ఒక సంకేతమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :