ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టాలీవుడ్ హీరోల‌ కెరీర్ మార్చే సినిమాలొస్తున్నాయి

టాలీవుడ్ హీరోల‌ కెరీర్ మార్చే సినిమాలొస్తున్నాయి

టాలీవుడ్‌లో అగ్ర హీరోలంద‌రికీ మంచి మార్కెట్ ఉంది. వారి కెరీర్లో ఎన్నో సూప‌ర్ హిట్ల రుచి చూసిన‌ప్ప‌టికీ వారికి కెరీర్లో అస‌లైన ఎదుగుద‌ల ఇప్పుడే మొద‌లైందంటున్నారు విశ్లేష‌కులు. పాన్ ఇండియా ప్రాజెక్టుల త‌ర్వాత వారి కెరీర్లో భారీ గ్రోత్ క‌నిపించ‌డం అంద‌రూ చూస్తున్నాం. 

బ‌న్నీ, పుష్ప సినిమాతో ఇప్ప‌టికే పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు యావ‌త్ భార‌తదేశం పుష్ప‌2 కోసం వెయిట్ చేస్తుంది. ఈ సినిమా కూడా ఖ‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు. పుష్ప‌2 త‌ర్వాత బ‌న్నీ కెరీర్లో భారీ మార్పులే వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

ఇక బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు కానీ ఆ త‌ర్వాతి సినిమాలు ప్ర‌భాస్ రేంజ్ ని పెంచ‌లేదు. ఆది పురుష్ సంగ‌తి ప‌క్క‌నపెడితే స‌లార్ మాత్రం ప‌క్కా హిట్ బొమ్మ అంటున్నారంతా. ఈ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ మార్కెట్ ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్‌కు వెళ్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

పోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చింది. కానీ వారి కెరీర్ గ్రోత్ మాత్రం వారు చేసే త‌ర్వాతి సినిమాల‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే చ‌ర‌ణ్ శంక‌ర్ తో చేసే సినిమా, ఎన్టీఆర్ కొరటాలతో చేసే సినిమాలే వారి కెరీర్ గ్రోత్‌ను డిసైడ్ చేస్తాయి. 

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ తో మూవీ చేస్తున్న మ‌హేష్, ఆ త‌ర్వాత రాజ‌మౌళితో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాను పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో రిలీజ్ చేసే అవ‌కాశాలుండ‌టంతో, ఆ సినిమా త‌ర్వాత మ‌హేష్ కెరీర్లో భారీ గ్రోత్ ఉండే ఛాన్సుంది. మొత్తానికి ఎప్పుడో ఇండ‌స్ట్రీకి వ‌చ్చినా మ‌న హీరోల కెరీర్‌లో సరైన గ్రోత్ ఇప్పుడిప్పుడే వ‌స్తోంద‌న్న‌మాట‌.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :