ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా అధ్యక్షుడి విమానంలో.. చోరీలు

అమెరికా అధ్యక్షుడి విమానంలో.. చోరీలు

ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే  ఈ విమానాన్ని ఎగిరే వైట్‌ హౌస్‌గా అభివర్ణిస్తారు. సకల సౌకర్యాలు, కట్టుదిట్టమన భద్రత, అత్యాధునిక రక్షణ వ్యవస్థల నడుమ ఎగిరే ఈ విమానంలో చోరీలు జరుగుతున్నాయంటే నమ్ముతారా? అదను చూసి గ్లాసులనో, ప్లేట్లలో గుట్టుగా బ్యాగుల్లో వేసుకొని విమానం దిగేసి వెళ్లిపోతున్నారట కొందరు. ఇలా హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్న వారు ఎవరంటారా? అధ్యక్షుడి వెంట ఆ విమానంలో ప్రయాణించే మీడియా ప్రతినిధులే. ఎయిర్‌ పోర్స్‌వన్‌లో తరచూ చోరీలు జరుగుతున్నాయని తెలిసింది. విస్కీ, వైన్‌ గ్లాస్‌లు శ్వేత సౌథాన్ని పోలివుండే నమూనాలు, పిల్లోకేస్‌లు ఇలా ఏ చిన్న వస్తువు  కనిపిస్తే దాన్ని బ్యాగుల్లో వేసుకొని విమానం దిగేస్తున్నారట. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ కరస్పాండెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కెల్లీ ఒడేనియల్‌ వెల్లడించారు. ఇక ముందైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని మీడియా ప్రతినిధులను ఆయన సున్నితంగా హెచ్చరించారు. ఫిబ్రవరి 5న ఎయిర్‌పోర్స్‌ వన్‌ లో చోరీ జరగ్గా వైట్‌ హౌస్‌ విజ్ఞప్తితో  ఓ మీడియా ప్రతినిధి పిల్లోకేస్‌ను తిరిగిచ్చాడు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :