ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఘనంగా తెలుగు కళా సమితి 40 వ వార్షికోత్సవ వేడుకలు 

ఘనంగా తెలుగు కళా సమితి 40 వ వార్షికోత్సవ వేడుకలు 

తెలుగు కళా సమితి నలభయ్యవ వార్షికోత్సవ సందర్భంగా నృత్య, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ మధు రాచకుళ్ల గారి ఆధ్వర్యంలో అక్టోబర్ 7, 8వ తేదీల్లో న్యూజెర్సీ రాష్ట్రంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు శ్రీ దాము గేదెలా గారు సమన్వయకర్త గాను, శ్రీమతి సుధా దేవులపల్లి మరియు శ్రీమతి స్వాతి అట్లూరి గార్లు సహా సమన్వయకర్తల గాను వ్యవహరించగా, తెలుగు కళా సమితి కార్య నిర్వాహక బృందం నేతృత్వం వహించింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘాలు ప్రతీ రెండేళ్లకు జాతీయ స్థాయిలో జరిపే సాంస్కృతిక ఉత్సవాల నమునాలో ఈ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరయిన వారందరూ తెలుగు కళా సమితి ఇంతవరకూ జరిగిన కార్యక్రమాల్లో ఇది అత్యుత్తమంగా వున్నదని వ్యాఖ్యానించడం గమనార్హం.

అక్టోబర్ 7వ తారీఖు రాత్రి 6 గంటలకు ఎడిసన్ నగరంలోని షెరటాన్ హోటల్ లో సంబరాల ప్రత్యేక విందు (బాంక్వేట్) ఘనంగా జరిగింది. తెలుగు కళా సమితి ఉపాధ్యక్షురాలు శ్రీమతి బిందు యలమంచిలి గారు మరియు కార్యదర్శి రవి అన్నదానం గారు ఆహుతుల్ని సాదరంగా ఆహ్వానించారు. తెలుగు కళా సమితి కార్యవర్గం మరియు సీనియర్ లీడర్ షిప్ వారిచే జ్యోతి ప్రజ్వలన, కుమారి వాగ్దేవి ప్రార్థనతో ప్రారంభమయిన ఈ కార్యక్రమాలకు శ్రీరష్మి మరియు మధు దౌలపల్లి వ్యాఖ్యాతలు గా వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం తెలుగు కళా సమితి అధ్యక్షులు శ్రీ మధు రాచకుళ్ల గారు సభికుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. గత 40 సంవత్సరాలుగా తెలుగు కళా సమితి సాధించిన ప్రగతిని  వివరిస్తూ ప్రస్తుతం స్థానిక కళాకారులు అంతర్జాతీయ స్థాయి ప్రతిభను ప్రసరిస్తున్నారని తెలియచేసారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా తమ కార్యవర్గం మహిళలకు, యువతకు వివిధ కళా రంగాలలో ప్రోత్సహించటానికి కృషి చేస్తారని తెలియచేసారు.  

న్యూజెర్సీ అసెంబ్లీ మాన్ శ్రీ స్టెర్లి ఎస్ స్టాన్లీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వార్షికోత్సవ సందర్భంగా శ్రీపేరి దివాకర్ గారి పర్యవేక్షణలో రూపొందించిన ప్రత్యేక సంచిక ప్రణతి సావనీర్ ని శ్రీ టీపి శ్రీనివాసరావు గారు ఆవిష్కరించటం జరిగింది. తెలుగుజ్యోతి సంపాదకులు శ్రీ విజ్ఞాన్ కుమార్ ఊటుకూరి పర్యవేక్షణలో రూపొందించిన తెలుగు జ్యోతి అంతర్జాల పత్రికను శ్రీ శ్రీ అట్లూరి గారు ఆవిష్కరించారు.  అనంతరం ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి ఆర్ధిక సహాయం చేసిన దాతలను శ్రీమతి స్వాతి అట్లూరి గారు వేదిక మీదకు ఆహ్వానించగా ముఖ్య అతిథి శ్రీ స్టెర్లి ఎస్ స్టాన్లీ గారు శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు. వివిధ రంగాలలో కృషి చేసి గుర్తింపు తెచ్చుకున్న వారికి అవార్డ్స్ కమిటీ చైర్ శ్రీమతి శ్రీదేవి జాగర్లమూడి ఆహ్వానించగా, ముఖ్య అతిథి శ్రీ స్టెర్లి ఎస్ స్టాన్లీ గారు శాలువ , జ్ఞాపికలతో సత్కరించారు. 

అక్టోబర్ 8న ఎడిసన్ నగరంలోని రాయల్ ఆల్బర్ట్ పేలస్లో ఉత్సవాల రెండవ రోజు కార్యక్రమాలు శివ విష్ణు టెంపుల్ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు, జ్యోతి ప్రజ్వలన ప్రారంభమయ్యాయి. తరువాత శ్రీ రఘు శంకరమంచి గారు, శ్రీ అనిల్ తాడిమళ్ల మరియు శ్రీమతి శైలజ ఘంటసాల పర్యవేక్షణలో శ్రీ నివాస కల్యాణం వైభవంగా జరిగింది. తరువాత తెలుగు కళా సమితి వారి  సాంస్కృతిక  కార్యక్రమాలు శ్రీమతి సుధా దేవుపల్లి గారు ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రదర్శింపబడ్డాయి. తిరు మహతి గ్రూప్ వారిచే అన్నమయ్య భక్తిగీతాలు, చిన్నయి నృత్యాలయ, కళాంజలి డాన్స్ స్కూల్, నృత్య మాధవీ స్కూల్ ఆఫ్ డాన్స్, సిద్దేంద్ర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ, ప్రేమానంద్ నృత్యాలయ, తార ఆర్ట్స్ అకాడమి విద్యార్థులు విభిన్న నృత్యాలను ప్రదర్శించారు. శ్రీమతి అట్లూరి గారి పర్యవేక్షణలో మహిళా నాయకత్వం మీ సెమినార్ నిర్వహించారు. స్వరరాగాసుధ ఆకాడమీ వారు మధురమైన గీతాలను ఆలాపించారు. శ్రీమతి పద్మజ వక్కలగడ్డ బృందం, శ్రీ రవి కామరసు బృందం లఘు హాస్య నాటికలను ప్రదర్శించారు.

గత సంవత్సర కాలంగా తెలుగు కళా సమితి కార్యక్రమాల్లో సే చేసిన వారికీ ప్రెసిడెంట్ వాలంటరీ సర్వీస్ అవార్డులను బహుకరించారు. ఈ  ప్రత్యేక వేడుకల సందర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ లో విజేతలకు బహుమతులు అందచేశారు. శ్రీ శేఖర్ వెంపరాల గారు బిజినెస్ సెమినార్ నిర్వహించారు. శ్రీ అట్లూరి గారి  పర్యవేక్షణలో అటిజం మీద సెమినార్ నిర్వహించారు. చిన్న వయస్సులోనే అత్యంత ప్రతిభ కనబరుస్తున్న గాయని  వాగ్దేవి అనేక పాటలు పాడి అందరిని అలరించారు. తరువాత సమర్పించిన సిరివెన్నెల స్మృత్యంజిలో స్థానిక కళాకారులు అత్యద్భుతంగా పాడి, నృత్యం చేసారు. ఈ కార్యక్రమాలకు సప్నా మాదిరాజు, వంశీప్రియ మరియు మధు దౌలపల్లి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. గత నలబై సంవత్సరాలుగా తెలుగు  కళా సమితి నిర్వహించిన కార్యక్రమాలపై శ్రీ మీగడ రామ లింగస్వామి రచించగా శ్రీ గరికిపాటి ప్రభాకర్ సంగీత దర్శకత్వం వహించి పాడిన తెలుగు కళా సమితి వైభవం నృత్యరూపకాన్ని సుమారు 132 మంది స్థానిక కళాకరులచే అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. 

తెలుగు కళా సమితి 40 వేడుకల్లో ఇతర తెలుగు సంఘాలు కూడా తమ కార్యక్రమాలతో భాగస్వామ్య అయ్యాయి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాట) వారు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఉచిత వాక్సిన్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.   వాసవి సొసైటీ వారు డాక్టర్ ఆన్ కాల్ పేరిట వివిధ ఆరోగ్య సమస్యలపై హెల్త్ సెమినార్ నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్Êఐ్ణస) వారు 7వ అమెరికా తెలుగు సంబరాలకు కొనసాగింపుగా సంబరాలతో సేవ` సంబరాలలో సేవ పేరిట కొన్ని ఛారిటీ లకు నిధులు పంపిణీ చేసారు. సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు ప్రదర్శించిన స్పేస్ థీమ్ మోడల్స్ అందరిని ఆకర్షించాయి. 

తరువాత ఈ వేడుకలకు ఆర్థిక సహాయం చేసిన ముఖ్య దాతలు శ్రీమతి స్వాతి శ్రీ అట్లూరి దంపతులను, శ్రీమతి నిర్మల శ్రీనివాసరావు టీపీ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన న్యూజెర్సీ అసెంబ్లీ మాన్ శ్రీ  స్టెర్లి ఎస్ స్టాన్లీ గారిచే తెలుగు కళా సమితిలో విశిష్ట సేవలు చేసినవారిని అవార్డులతో సత్కరించారు. తరువాత తెలుగు కళా సమితికి అండదండలుగా వుంది ప్రోత్సాహమిస్తున్న ...... మొదలైన తెలుగు సంఘాల కార్యవర్గ సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి కృతజ్ఞతలు తెలియచేసారు. రాత్రి విందు భోజనానంతరం ప్రఖ్యాత గాయకురాలు మంగ్లీ బృందంచే సంగీత విభావరి జరిగింది. 

ఈ కార్యక్రమానికి నిధుల సేకరణ వ్యవహారాలను నిర్వహించి శ్రీ అనిల్ కుమార్ వీరిశెట్టి గారు అందరి మన్ననలు పొందారు. కార్యకర్తల సమీకరణ, మరియు వేలమంది  అతిధులకు భోజన ఏర్పాట్లు మొదలగు క్లిష్టమైన వ్యవహృారాలను శ్రీ నాగ మహేందర్  వెలిశాల నిర్వహించారు. పటిష్టమైన ప్రణాళికతో  ఆర్థిక వ్యవహారాలను కోశాధికారి శ్రీ శ్రీనివాస్ చెరువు గారు అత్యంత సమర్ధనీయంగా నిర్వహించి పలువురి మెప్పు పొందారు. మీడియా, పబ్లిసిటి, కళాకారులు వసతి, ప్రయాణం, ఏర్పాట్లు వంటి గురుతర బాధ్యతలు ఉపాధ్యక్షురాలు శ్రీమతి బిందు యలమంచిలి గారు, శ్రీ వెంకట సత్య తాతా గారు మరియు శ్రీమతి జ్యోతి కామరసు గారు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతమవటానికి సుమారు 28 కమిటీలు కృషి చేసాయి. ఈ కమిటీలన్నింటినీ సమన్వయము చేసి కృషి చేసిన కార్యదర్శి రవి అన్నదానంకు తెలుగు కళా సమితి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు.

ఈ సంబరాల వేదికను అలంకరించిన శ్రీమతి గిరిజా మాదాసి గారిని, ఈ వేడుకలను చక్కగా చిత్రీకరించిన ఫోటోగ్రాఫర్ ఆనంద్ గారిని మరియు బాంక్వేట్ కు రుచికరమైన భోజనం అందించిన భోగ్ రెస్టారెంటు వారికి, అక్టోబర్ 8న మంచి రుచికరమైన భోజనం అందించిన రాయల్ ఆల్బర్ట్ పాలస్ వారిని తెలుగు కళా సమితి కార్యవర్గం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసింది. సుమారు 2500 మందికి పైగా తెలుగు వారు తిలకించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేసారు. అనంతరం తెలుగు కళా సమితి కార్య నిర్వాహక బృందం వారిచే, వందన సమర్పణ జనగణమన జాతీయ గీతాలాపతో తెలుగు కళా సమితి నలభయ్యవ వార్సికోత్సవాలు ముగిసాయి. 

 

Click here for Event Gallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :