ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్న ఫ్లోరిడా తెలుగు సంఘం

సంక్రాంతి సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్న ఫ్లోరిడా తెలుగు సంఘం

టంపా బేలోని ఫ్లోరిడా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 20వ తేదీ అంటే శనివారం నాడు ఒడెస్సాలోని కీస్టోన్ పార్క్ వేదికగా సంక్రాంతి వేడుకలను నిర్వహించనున్నారు. పతంగులు, ముగ్గులు, ఆటలు, పాటలతో తెలుగు వారంతా సంతోషంగా గడిపాలని, స్థానికంగా ఉన్న తెలుగు కమ్యూనిటీ సభ్యులంతా ఈ సంబరాల్లో పాల్గొనాలని ఫ్లోరిడా తెలుగు సంఘం కోరుతోంది. తెలుగు వారికి సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఈ పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫ్లోరిడా తెలుగు సంఘం నిర్వాహకులు తెలియజేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :