ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సిలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుక

న్యూజెర్సిలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుక

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) వ్యవస్థాపకులు డా.  పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో, అడ్వైజరీ చైర్‌ డా విజయపాల్‌ రెడ్డి, అడ్వైజరీ కో చైర్‌ మోహన్‌ రెడ్డి పట్లోళ్ల, అడ్వైజరీ మెంబర్‌ భరత్‌ మాదాడి, సంస్థ అధ్యక్షులు వంశీ రెడ్డి నేతృత్వంలో,  నేషనల్‌ బతుకమ్మ అడ్వైజర్‌, సెక్రటరీ కవిత రెడ్డి సూచనలతో ఈ సంవత్సరం కూడా అన్నిచోట్లా బతుకమ్మ పండగ సంబరాలు రంగ రంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది ఈ సంబరాలకు వచ్చి బతుకమ్మ పండగపై, తెలంగాణ సంస్కృతిపై తమకున్న అభిమానాన్ని చాటుతున్నారు. 

టిటిఎ అడ్వైసరీ కో చైర్‌ మోహన్‌ రెడ్డి పట్లోళ్ల స్వంత రాష్టం న్యూజెర్సీ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. టిటిఎ జాయింట్‌ సెక్రటరీ శివారెడ్డి కొల్ల మరియు బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ సుధాకర్‌ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్‌ యారవ నేతృత్వంలో టిటిఎ న్యూజెర్సీ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ మధుకర్‌ రెడ్డి, సాయి గుండూర్‌ ఆధ్వర్యమున రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో శనివారం, అక్టోబర్‌ 21, 2023 న నిర్వహించిన సంబరాలు 5000 మందికి పైగా ఆహుతులతో కిక్కిరిసింది.  ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పండగకు సంప్రదాయ అలంకారణతో, తము చేసిన బతుకమ్మలతో  వస్తున్న మహిళలు, పురుషులు మరియు పిల్లలతో సందడి మొదలయ్యింది. డప్పు చప్పుళ్లతో బతుకమ్మలకు ఘనమైన స్వాగతం లభించింది. 

ఈ సంబరాలకు 200 పైగా బతుకమ్మలను మహిళలు తయారు చేసుకుని తీసుకొని వచ్చారు  వచ్చిన వారందరికీ అరుణ్‌ ఆర్కాల ఆధ్వర్యంలో వాలంటీర్లు మధ్యాహ్నం 12 గంటలకు కమ్మటి సంప్రదాయ విందు భోజనం వడ్డించారు. సాయి దత్త పీఠంకు చెందిన పురోహితులు  మధు భాస్కర శర్మ, డా. మోహన్‌ రెడ్డి పట్లోళ్ళ వారి శ్రీమతి శైలజతో  గౌరి దేవి పూజ చేయించి బతుకమ్మ పండగను ఆరంభించారు. టిటిఎ కమిటీ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. టిటిఎ ఇవిపి నర్సింహా రెడ్డి దొంతిరెడ్డి రెడ్డి గారు, న్యూ జెర్సి ఆర్‌విపి మధుకర్‌ రెడ్డి, సాయి గుండూర్‌ వచ్చిన వారందరికీ ఆహ్వానం పలికారు. తన్విక, తారిక చేసిన మహిషాసుర మర్ధిని నృత్యం అలరించింది.      
ప్రముఖ నేపథ్య గాయని, ఆహా తెలుగు ఇండియన్‌ ఐడల్‌ విజేత సౌజన్య భాగవతుల చక్కటి బతుకమ్మ పాటలతో కోలాహలం మొదలయ్యింది. శ్రీమతి దీప్తి యాయవరం కార్యక్రమానికి వ్యాఖ్యాత వ్యవహరించడమే కాకుండా చక్కటి పాటలతో మహిళలను మరింత ఉత్తేజ పరిచారు. అలాగే స్థానిక గాయని శ్రీజ బొడ్డు బతుకమ్మ పాటలను పాడి అందరినీ ఆనందింపజేసారు. చక్కగా అలంకరించుకొని, వేలాది మహిళలు, అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడడం, ప్రముఖ గాయని సౌజన్య బతుకమ్మ పాటలు పాడడం  - తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించింది. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ మహిళలు చేసిన లయ విన్యాసం అమోఘం అపూర్వం. వర్ణించడానికి మాటలు సరిపోని ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందారు వచ్చేసిన ఆహుతులంతా!

తెలుగు నేల నుండి వచ్చిన ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ శ్రీ సత్య శ్రీనివాస్‌ 12 అడుగుల ఎత్తైన అద్భుతమైన బతుకమ్మను అతి సుందరంగా తయారు చేశారు. ఈ బతుకమ్మ సంబరాలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  నరసింహా పెరుక ఆధ్వర్యంలో శ్రీమతి దీప జలగం మరియు వాలంటీర్లు ఈ బతుకమ్మ తయారీకి సహాయం చేశారు. 
ఈ సంబరాలకు తెలుగు కళా సమితి తన వంతు సహాయం అందజేసింది.  టిఫాస్‌ అధ్యక్షులు మధు రాచకుళ్ల  వారి కార్యవర్గం ఈ కార్యక్రమానికి విచ్చేసి సంబరాలలో పాల్గొన్నారు. అలాగే వివిధ స్థానిక మరియు జాతీయ సంస్థలైన నాటా, ఆటా, తానా, నాట్స్‌ నుండి ప్రముఖులు విచ్చేసి ఈ సంబరాలలో  ఒక భాగం అయ్యారు.  సుధాకర్‌ ఉప్పల, శివా రెడ్డి వీరందిరినీ వేదిక మీదికి ఆహ్వానించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కార్యావర్గాన్ని సభికులకు పరిచయం చేసారు. 
  పిఎంజె జ్యూవెల్లర్స్‌ వారు చక్కగా పేర్చిన బతుకమ్మలకు (మొదటి, రెండవ మరియు మూడవ స్థానంలో వచ్చిన వారికి) విలువైన బహుమతులు అందజేసారు. మాయ ఫైన్‌ జ్యూవెల్స్‌ వారు చక్కగా అలంకరించుకొన్న మహిళలో మొదటి, రెండవ మరియు మూడవ స్థానం లో ఉన్నవారికి చక్కని బహుమతులు అందజేసారు.  దీప జలగం   ఆధ్వర్యంలో ఈ బహుమతి ప్రదానం జరిగినది. 

ఈ కార్యక్రమానికి న్యూ జర్సీ కి చెందిన స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసి అందరికీ తమ అభినందనలు, శుభాకాంక్షలు అందజేసారు. వచ్చిన ప్రముఖులలో కొందరు - సామ్‌ జోషి (ఎడిసన్‌ టౌన్‌షిప్‌ మేయర్‌) , అజయ్‌ పాటిల్‌ (కౌన్సిల్‌మేన్‌)  మరియు న్యూజెర్సి స్టేట్‌ సెనెటర్‌ సామ్‌ థామ్సన్‌  తమ శుభాకాంక్షలు అందజేసారు. స్పాన్సర్లు, డోనర్లు, ఆర్టిస్టులకు అందరికీ జ్ఞాపికలు అందజేసారు. ఎడిసన్‌ నుండి, మరియు న్యూ జర్సీ రాష్ట్రం నుండి ప్రత్యేక ప్రశంసలు కూడా ఈ సంబరాలకు లభించాయి. నరేందర్‌ యారవ గారి ఆధ్వర్యంలో బతుకమ్మల నిమజ్జనం ఘనంగా జరిగినది.   న్యూ జెర్సీ టీం సభ్యులు మరియు పలువురు (ముఖ్యంగా యువత) ఈ బతుకమ్మ పండగ ఘనంగా జరగడానికి కృషి చేశారు. వస్త్రాలు, నగలు మరియు ఇతర విక్రేతలు తమ తమ స్టాల్స్‌ తో వచ్చిన వారికి షాపింగ్‌ సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులందరికీ, ధన సహాయం చేసిన దాతలకు, చక్కగా బతుకమ్మలను చేసిన మహిళలకు, మీడియాకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.  

టిటిఎ అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్‌ మోహన్‌ రెడ్డి పట్లోళ్ళ, జాయింట్‌ సెక్రటరీ, బోర్డ్‌ డైరెక్టర్‌ శివారెడ్డి కొల్ల, బోర్డ్‌ డైరెక్టర్‌, ఎన్‌జె, సుధాకర్‌ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్‌ యారవ, రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ మధుకర్‌ రెడ్డి, సాయి గుండూర్‌, మెంబర్‌ షిప్‌ చైర్‌ అరుణ్‌ రెడ్డి అర్కాల, న్యూజెర్సి కోర్‌ టీమ్‌ సభ్యులు దీప జలగం,  సంధ్య కాసుల, అనూష రెడ్డి, లలిత రెడ్డి, రాజా నీలం, ప్రశాంత్‌ నలుబంధు, శంకర్‌ రెడ్డి వులుపుల, శ్రీనివాస్‌ రెడ్డి మాలి, నవీన్‌ కౌలూరు, నవీన్‌ యలమండల, శ్రీనివాస్‌ జక్కిరెడ్డి, వెంకీ నీల, విష్ణు రెడ్డి, రఘువీర్‌ పి., శివ నారా, బాల గణేష్‌, సాయిరామ్‌ గాజుల, ప్రణీత్‌ నల్లపాటి, సతీష్‌ మేకల, శిల్ప రామడుగు, న్యూజెర్సి యూత్‌ సభ్యులు నిమిష పెరుక, ఆశ్రిత్‌ యారవ, హసిక ఆర్కాల, సుజయ్‌ వులుపుల, యాస్మిత బొమ్మూ, విద్యావతి అలవకొండ, ఇసితా రెడ్డి మాలి, వేదాంశి గొట్టుముక్కల, శృతి కృష్ణ పేరుమల, సుచిర్‌ బత్తిని, హర్షిత్‌ యారవ, రిషితా జంబుల తదితరులు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు. 

 

Click here for Event Gallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :