ASBL NSL Infratech

డిసెంబర్ 11వ తేది నుండి తానా తెలుగు సాంస్కృతిక సిరులు

డిసెంబర్ 11వ తేది నుండి తానా తెలుగు సాంస్కృతిక సిరులు

తెలుగు భాషా సంస్కృతులు చాలా పురాతన మైనవి. కూచిపూడి, పేరిణి నాట్యాలు, సురభి నాటకం, కర్ణాటక సంగీతం ఇంకా హరికథ, బుర్ర కథ, డప్పు, తప్పెట గుళ్ళు గరగలు, కోలాటం, దింసా, కొమ్ముకోయ వంటి వందలాది జానపద, గిరిజన కళా రూపాలకు తెలుగు నేల పురుడు పోసి పెంచి పెద్ద చేసి ప్రపంచానికి అందించింది. ఆధునిక కాలానికి చెందిన లలిత సంగీతం, గజల్, వివిధ రకాల వాయిద్య సాధనాల ప్రతిభ తెలుగు వారు స్వంతం చేసుకున్నారు.

వాటిలో కొన్నిఅర కొర ఆదరణ తో కొట్టుమిట్టాడుతున్నాయి. మరికొన్ని అవసాన దశకు చేరుకు న్నాయి. తెలుగు వారి సృజనాత్మకతకు, కళా నైపుణ్యానికి చిహ్నలైన వీటిని ప్రోత్సహించాలనే సంకల్పంతో "తానా తెలుగు సాంస్కృతిక సిరులు" పేరిట ప్రతీ నెల రెండవ శనివారం ఒక కళా రూపం తో తానా మీ ముందుకు వస్తుంది. ఈ నెల11 వ తేది నుండి ఈ క్రొత్త కార్యక్రమం "హరికథా మృతం" తో ప్రారంభిస్తున్నాం.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :