ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కొత్త మలుపు తీసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్.. అప్రూవర్ గా మారిన ఏ13..

కొత్త మలుపు తీసుకున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్.. అప్రూవర్ గా మారిన ఏ13..

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎటువంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దీనివల్ల చోటు చేసుకున్న పరిణామాలు యావత్ రాష్ట్రాన్ని ఒక్కసారి షాక్ కి గురి చేశాయి. ప్రస్తుతం ఈ కేసు మరో సరికొత్త మలుపు తిరిగింది.ఈ కేసులో ఏ13గా ఉన్న చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారడంతో ఈ కేసు విషయంలో ఏమి జరగబోతోంది అన్న డిస్కషన్ మరొకసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇప్పటికే చంద్రకాంత్ కు సంబంధించి మొబైల్ ఫోన్స్ ,డాక్యుమెంట్స్, కంప్యూటర్స్ ,లాప్టాప్స్ మొదలైనవి ఏసీబీ కోర్టుకు ఏపీ సీఐడీ సమర్పించారు. చంద్రకాంత్ కూడా విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు.

మరోపక్క చంద్రబాబు తరఫున న్యాయవాది అప్రూవల్ గా మారిన చంద్రకాంత్ షా కు సంబంధించిన డాక్యుమెంట్స్ ను అడిగారు. విచారించే క్రమంలో కావలసిన డేటా కోసం సిఐడి కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వవలసిందిగా ఆయన అయితే దీనిపై ఒక పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా చంద్రబాబు న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. అప్పటివరకు చంద్రకాంత్ స్టేట్మెంట్ రికార్డును కోర్టు వాయిదా వేసింది.

కనీ విని ఎరుగని రీతిలో.. మాజీ ముఖ్యమంత్రి. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ కేసు పుణ్యమా అని అరెస్టు అయ్యారు. కనీసం వేలు కూడా మంజూరు కానీ స్థితిలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఆయన రెండు నెలల పాటు ఉన్నారు. మర్డర్ల దగ్గర నుంచి ఎన్నో ఘోరమైన ఘాటుక నేరాలు చేసిన వాళ్లు కూడా కాలర్ ఎగరేసి బెయిల్ మీద తిరుగుతుంటే.. మాజీ ముఖ్యమంత్రి కి రాజకీయ దురదరుడైన చంద్రబాబుకి బెయిల్ ఎందుకు దొరకలేదు అనేది ఇప్పటికీ బేతాళ ప్రశ్న గానే మిగిలిపోయింది. ప్రస్తుతం హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంద్రబాబు విడుదలై బయటికి వచ్చి పార్టీకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు.

అయినా సరే ఆయనపై ఈ కేసు ఎప్పుడు ప్రమాదంలో వేలాడుతూనే ఉంది. మరి ఇప్పుడు ఈ కేసులో వచ్చిన కొత్త మలుపు ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో తెలియదు.ఈ నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై ఈనెల 18వ తేదీన విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. అంటే చంద్రకాంత్ స్టేట్మెంట్ ఎప్పుడు రికార్డ్ చేయాలి అనే విషయాన్ని న్యాయస్థానం ఆ రోజే చెబుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి మరొక వాయిదా కూడా కావాలి అని చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోరారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు మరిన్ని మలుపులు తిరుగుతుందో అర్థం కావడం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :