కొలంబస్ లో వైభవంగా శివ పార్వతి కళ్యాణం

కొలంబస్ లో వైభవంగా శివ పార్వతి కళ్యాణం

కొలంబస్ పట్టణం లో ఆంధ్రా పీపుల్ అఫ్ సెంట్రల్ ఒహియో (APCO) ఆధ్వర్యంలో జరుగుతున్న దుర్గా మల్లేశ్వర దేవస్థానం వారి పూజల కార్యక్రమంలో 3 వ రోజు ఉదయం అత్యంత వైభవంగా శివ పార్వతి కళ్యాణం జరిగింది. దాదాపు 400కి పైగా భక్తులతో, 70 మంది పైగా దంపతులు కళ్యాణం లో పాల్గొన్నారు.

APCO కార్య వర్గం చేసిన ఏర్పాట్లతో భక్తులు కళ్యాణ కార్యక్రమంలో వివిధ ఘట్టాలలో పాల్గొనటం చాలా సంతోషం గా వున్నదని మహిళలు తెలిపారు. APCO పూర్వ అధ్యక్షులు శ్రీ నాగేశ్వర రావు మన్నే, అధ్యక్షులు శ్రీ వేణు పసుమర్తి, కోశాధికారి శ్రీ వేణు తలశిల, కార్యవర్గ సభ్యులు శ్రీ జగదీష్ ప్రభల, శ్రీమతి రవి కుమారి, శ్రీమతి వాణి, శ్రీమతి శాంతి, శ్రీ రవి నవలూరి, శ్రీ పవన్ చలంచాల, శ్రీ శ్రీనివాస పోలిన, శ్రీ చందు బోగ్గవరపు, శ్రీ శ్రీధర్ వేగేశ్న చాలా శ్రమతో మూడు రోజులు విజయవంతం గా జరిపారు.

శ్రీమతి రవి కుమారి దుర్గమ్మ వారి చీరలను వేలం వేయగా  భక్తులు ఉస్తాహం గా పాల్గొన్నారు. శ్రీ నాగేశ్వరరావు మన్నే, శ్రీ వేణు పసుమర్తి మెయిన్ స్పాన్సర్స్ శ్రీ వీరయ్య చౌదరి పేరిని దంపతులని, దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం పురోహితులు, ఎన్ ఆర్ ఐ విభాగం సలహాదారు శ్రీ సుబ్బా రావు చెన్నూరి లను సత్కరించారు. భక్తులందరూ మహా ప్రసాదం తీసుకొన్నారు.

 

Click here for Photogallery

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :