ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పాకిస్తానీ సినిమాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న రణబీర్...!

పాకిస్తానీ సినిమాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న రణబీర్...!

బాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ టాలెంటెడ్ హీరో రణబీర్ కపూర్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న రణబీర్, ఇటీవల తెలుగు ప్రేక్షకుల మనసుల్ని సైతం 'బ్రహ్మాస్త్రం' తో దోచుకున్నాడు.

ఈ హీరో రీసెంట్ గా సౌదీ అరేబియాలో జరిగిన రెడ్ సి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం చేస్తున్న అన్ని సినిమాలు నాకెంతో సంతృప్తిని ఇస్తున్నాయి, కానీ మొదటి నుండి నాకు దర్శకత్వంపై మక్కువ ఉంది అని ఈ ఈవెంట్ లో ఓపెన్ అయ్యారు రణబీర్. కథలు రాసే విషయంలో తను చాలా వీక్ అని, ఎన్నో మెళకువలు నేర్చుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా హాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఉందా? అని మీడియా ప్రశ్నించగా, ప్రెజెంట్ చేస్తున్న సినిమాలు నాకు సంతృప్తిని ఇస్తున్నాయి. హ్యాపీగానే ఉన్నాను కనుక వేరే భాషలలో చేయాలని అంత ఆశ లేదు అన్నారు. కానీ, అవకాశం వస్తే మాత్రం ఏ భాషలో నటించడానికైనా రెడీ అని రణబీర్ అన్నారు. మరి రానున్న రోజుల్లో దర్శకత్వం వైపు ఈ హీరో అడుగులు వేస్తాడేమో చూడాలి.

ఇటీవల పాకిస్తాన్ లో రిలీజయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్ ' సినిమా గురించి మాట్లాడుతూ, తాను పాకిస్తాన్ సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నానంటూ వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రణబీర్ బ్రహ్మాస్త్రం పార్ట్ 2 ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :