ఫోర్బ్స్ జాబితాలో పి.వి. సింధు
భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు 2023లో అత్యధికంగా ఆర్జించిన మహిళా అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఆమె రూ.59 కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్తో కలిసి 16వ స్థానంలో నిలిచింది. గతేడాది కూడా ఇంతే ఆదాయాన్ని సంపాదించిన సింధు, 12వ స్థానాన్ని సాధించింది. 2018లో రూ.70 కోట్లతో సింధు ఫోర్బ్స్ జాబితాలో అత్యున్నతంగా ఏడో స్థానాన్ని దక్కించుకుంది. 2023లో దాదాపుగా రూ.198 కోట్ల ఆదాయంతో టెన్నిస్ స్టార్ ఇగా స్వైటెక్ అగ్రస్థానంలో దక్కించుకుంది.
Tags :