ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూఢిల్లీ-మాస్కో స్నేహగీతం..

న్యూఢిల్లీ-మాస్కో స్నేహగీతం..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ...ఇటీవలికాలంలో పదేపదే భారత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మిత్రదేశమంటే భారతే అంటున్నారు. అంతేకాదు.. ప్రధానమంత్రి మోడీని ఆకాశానికెత్తేస్తున్నారు.ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని మెచ్చుకుంటున్నారు. ఇంతకూ పుతిన్ ఎందుకంతగా భారత్‌ను ప్రశంసిస్తున్నారు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధసమయంలో పాశ్చాత్యదేశాలన్నీ రష్యాను వ్యతిరేకించాయి. విపరీతంగా ఆంక్షలు విధించాయి. అయితే అలాంటిసమయంలో భారత్ మాత్రం..వాటిని వ్యతిరేకించింది. యుద్ధం మంచిది కాదని మిత్రుడికి చెబుతూనే.. ఆదేశం నుంచి వేలాది టన్నుల క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది.

యుద్ధసమయం, ఆంక్షల వలయంలో కొట్టుమిట్టాడుతున్న రష్యాకు.. ఇది ఊపిరిపోసినట్లైంది. అంతేకాదు.. అగ్రదేశాలు వ్యతిరేకించినా, భారత్ మాత్రం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోంది. భారత్‌ అనుసరిస్తోన్న విదేశీ విధానంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. అలా పాటించడం నేటి ప్రపంచంలో అంత సులభం కాదన్నారు. ఆ దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బయటనుంచి ఆటలు ఆడే ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు. ‘రష్యన్‌ స్టూడెంట్‌ డే’ సందర్భంగా కాలినింగ్రాడ్‌ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటించిన పుతిన్‌.. ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించారు.

‘స్వతంత్ర విదేశీ విధానాన్ని భారత్‌ అనుసరిస్తోంది. నేటి ప్రపంచంలో అది అంత తేలిక కాదు. సుమారు 150 కోట్ల జనాభా కలిగిన భారత్‌కు ఆ హక్కు ఉంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో భారత్‌ ఒకటి. అది కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వల్లే. ఆయన సారథ్యంలోనే భారత్‌ ఇంతటి వేగం పుంజుకుంది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోదీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యం. ఈక్రమంలో భారత్‌, ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చు’ అని పుతిన్ పేర్కొన్నారు. భారత్‌లో రాజకీయ పలుకుబడి కోసం ఆటలాడవద్దని బయటి శక్తులను హెచ్చరించిన ఆయన.. అటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు.

‘భారత్‌కు గొప్ప సంస్కృతి ఉంది. జాతీయ టీవీ ఛానెళ్లలో భారతీయ సినిమాలను ప్రసారం చేసే అతికొద్ది దేశాల్లో రష్యా ఒకటి. ఇలా మరే దేశం చేస్తుందని అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మొదలైన ‘మేకిన్‌ ఇండియా’ కార్యక్రమాన్ని రష్యాతో పాటు ఎన్నో దేశాలు చూస్తున్నాయి. ఆ ప్రణాళికలన్నింటినీ ఆచరణలో పెట్టేందుకు భారత భాగస్వాములతో కలిసి ప్రయత్నిస్తున్నాం. భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా రష్యా నుంచే వస్తున్నాయి’ అని పుతిన్ వెల్లడించారు. ఓ చమురు శుద్ధి కర్మాగారం కొనుగోలు, గ్యాస్‌ స్టేషన్లు, పోర్టులు తదితర రంగాల్లో పెట్టుబడులను ఆయన ప్రస్తావించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :