ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అంబరాన్నంటిన నైటా రిపబ్లిక్‌ డే సంబరాలు 

అంబరాన్నంటిన నైటా రిపబ్లిక్‌ డే సంబరాలు 

న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో రిపబ్లిక్‌ డే ఫ్లాగ్‌ హోస్టింగ్‌ కార్యక్రమాన్ని అబ్బురపరిచే రీతిలో బేత్ప్జా  సీనియర్‌ కమ్యూనిటీ సెంటర్ లో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం అధ్యంతం కనులవిందుగా చిన్నారుల ఆటపాటలతో కోలాహలొంగా సాగింది. నైటా ప్రెసిడెంట్‌ వాణి సిగిరికొండ మరియు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ అండ్‌ అడ్వైజర్స్‌ సమిష్టి కృషితో కార్యక్రమాన్ని చాలా చక్కగ నిర్వహించడం జరిగింది.

మొదటగ కార్యక్రమాన్ని సెక్రెటరీ రవీందర్‌ కోడెల ప్రారంబిస్తూ 75 ఘనతంత్ర దినోత్సవం ఖండాంతరాలు దాటి, ఏ దేశమేగిన ఎందుకాలిడిన అంటూ మాతృభూమిలో జరుపుకునే విధముగా ఈ కార్యక్రమానికి వచ్చినవారి అందరిని సాదరంగా ఆహ్వానించారు. తదుపరి బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ సెక్రెటరీ సతీష్‌ కల్వ  మరియు అడ్వైసర్‌ చిన్నబాబు రెడ్డి అందరిని కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, జెండా వందనం కార్యక్రమాన్ని ఏర్పాటుకు ప్రెసిడెంట్‌ వాణి గారిని మరియు ఎగ్జిక్యూటివ్‌ కమిటీని అభినందించడం జరిగింది. 

సింగర్‌ దివ్య మీనన్‌ గణేష్‌ స్తోత్రంతొ మొదటగా కార్యక్రమం ప్రారంభం జరిగింది. సింగర్‌ జ్యోత్స్నా మరియు దివ్య చక్కటి పాటలతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ముఖ్యంగ జ్యోత్స్నా పాడిన పాటలు అహుతులను ఆకట్టుకున్నాయి. స్పెషల్‌ టాలెంటెడ్‌ వండర్‌ కిడ్‌ రియా తన యొక్క పంప్‌ కిన్‌ స్కిట్‌ తొ చిన్నారులు మరియు పెద్దల మనసులను అక్కట్టుకుంది. మిస్‌ న్యూయార్క్‌ అవని సోఫియా డిసోజా కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణంగా నిల్వడం జరిగింది. మరియు ముఖ్యంగా చిన్నారులు వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయలను ప్రతిబింబిచేలా యూనిటీ అండ్‌ డైవర్సిటీ ప్రోగ్రాం ఆధ్యంతం కొలహాలంగా కరతాల ధ్వనుల మధ్య జరగడం చాలా హర్షనీయం, అభినందనీయం.

ఈ కార్యక్రమానికి మింగ్లీ నాస్సా కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ గెస్ట్‌ గా హాజరు కావడం అదేవిధంగా నైటాకి కౌంటీ తరుపున సైటేషన్‌ ప్రెసెంట్‌ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఫిలాంథ్రపిస్ట్‌ సంస్థ శే్ఱయోభిలాషి డా. మల్లారెడ్డి పైలా గారు వారి సతీమణి సాధనగారు, డోనార్స్‌, నైటా టీం మరియు కార్యక్రమానికి వచ్చిన వారి అందరి సమక్షములో మల్లా రెడ్డి పతాక ఆవిష్కరణం చేయడం జరిగింది.  తదనంతరం జన ఘణ మన జాతీయగీతం మరియు అమెరికన్‌ జాతీయ గీతం ఆలపించడం జరిగింది. గెస్ట్‌ మింగ్లీ మరియు మల్లా రెడ్డి, సింగర్స్‌ జ్యోత్స్నా, దివ్య మీనన్‌, వండర్‌ కిడ్‌ రియా మరియు అవని మిస్‌ న్యూయార్క్‌ లని శాలువా, మెమోంటోలతొ సత్కరించడం జరిగింది. 

తదనంతరం మంచి పాటలు, చిన్నారుల అట పాటలతో కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా జరిగింది. చివరగా ప్రెసిడెంట్‌ వాణి కార్యక్రమం ఇంత భారీఎత్తున చక్కగా జరగటానికి సహకరించిన ఎగ్జిక్యూటివ్‌ టీం, బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌, అడ్వైసర్స్‌ మరియు వాలంటీర్స్‌ అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన చిన్నారులను, పేరెంట్స్‌, అతిథులు, దాతలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని టీవీ మాధ్యమం ద్వారా ప్రసారం చేసిన మన టీవీ మిత్రులకు ధన్యవాదములు తెలియచేయడం జరిగింది. చివరగా చక్కటి విందు భోజనంతొ కార్యక్రమం ముగిసింది.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :