ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ: ఎవరికి నచ్చని 'నేను మీకు బాగా కావలసినవాడిని'

రివ్యూ: ఎవరికి నచ్చని 'నేను మీకు బాగా కావలసినవాడిని'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5

నిర్మాణ సంస్థ: కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్,
నటి నటులు: కిరణ్ అబ్బవరం,సంజనా ఆనంద్,సిద్ధార్థ్ మీనన్,ఎస్.వి.కృష్ణారెడ్డి,బాబా భాస్కర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి, ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీత దర్శకుడు: మణి శర్మ, సమర్పణ: కీ శే. కోడి రామకృష్ణ
నిర్మాత: కోడి దివ్య దీప్తి, దర్శకుడు: శ్రీధర్ గాదె
విడుదల తేదీ:16.09.2022

‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. తర్వాత వచ్చిన ‘SR కళ్యాణ మండపం’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు. యూత్‌లో కాస్త క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కమర్షియల్ అంశాలతో పాటు వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా ఈ రోజు  రిలీజైంది. మరి ఆ సినిమా ఎలా ఉందనేది సమీక్షలో  తెలుసుకుందాం...

కథ :

ఒకానొక సందర్భంలో వివేక్ (కిరణ్ అబ్బవరం) క్యాబ్ డ్రైవర్ గా తేజు (సంజన ఆనంద్)కి పరిచయం అవుతాడు. అప్పటికే, తేజు లవ్ ఫెయిల్యూర్ తో పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. అసలు ఆమె ఎందుకు అలా ఉంది ? ఆమె జీవితంలో జరిగిన బాధాకరమైన కథ ఏమిటీ ? ఆమె గతం తెలుసుకుని వివేక్ ఏం చేశాడు ? అసలు వివేక్ ఎవరు ? లాయర్ దుర్గ అంటూ అతను చెప్పిన లవ్ స్టోరీ లో నిజం ఎంత ? చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? వివేక్ – తేజు ఫైనల్ గా ఒక్కటి అయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

నటి నటుల హావభావాలు:

కిర‌ణ్ అబ్బ‌వ‌రం మ‌న ప‌క్కింటి కుర్రాడిలాంటి పాత్ర‌లో న‌టించి మ‌రోసారి మెప్పించాడు. పాత్ర ప‌రంగా త‌న న‌ట‌న ఓకే. ఇక హీరోయిన్ సంజ‌నా ఆనంద్ పాత్ర చుట్టూనే సినిమా అంతా ర‌న్ అవుతుంది. ఆమె న‌ట‌న ప‌రంగా ఓకే అనించిందే త‌ప్ప‌.. ఆ పాత్ర‌లోని ఎమోష‌న్స్‌ను ఇంకా బాగా చేసుండ‌వ‌చ్చు అనే భావ‌న క‌లిగింది. ఇక బాబా భాస్క‌ర్ పాత్ర‌లో కాస్తో కూస్తో కామెడీ క‌నిపించింది. అది త‌ప్ప సినిమాలో ఎంట‌ర్‌టైనింగ్ పార్ట్ వెతికినా క‌న‌ప‌డ‌దు. సిద్ధార్థ్ మీన‌న్ చుట్టూనే ఫ‌స్టాఫ్ అంతా న‌డుస్తుంది. నిజానికి ఫ‌స్టాఫ్‌లో అత‌నే హీరో అనిపిస్తాడు. ఇక సినిమాలోని ఇత‌ర తారాగ‌ణంగా న‌టించిన ఎస్‌.వి.కృష్ణారెడ్డి, స‌మీర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ద‌ర్శ‌కుడు సినిమాను కథా పరంగా తెర‌కెక్కించ‌లేద‌నే చెప్పాలి. నిజానికి ఇదే క‌థాంశంతో ఇంత‌కు ముందు శ‌శిరేఖా ప‌రిణయం అనే సినిమాను రూపొందించారు.. త‌న‌తో పెళ్లి ఇష్టం లేకుండా వెళ్లిపోయిన హీరోయిన్‌ని హీరో ఫాలో అవుతూ చివ‌ర‌కు ఆమె ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌ట‌మే ఆ సినిమా క‌థాంశం. ఈ సినిమాలో ప్ర‌ధాన‌మైన పాయింట్ అదే. కానీ బ్యాక్‌డ్రాప్‌ను మ‌రో చూపిస్తూ క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ప్రేక్ష‌కుడుకి క‌నెక్ట్ కావాల్సిన పాయింట్ హ‌త్తుకోదు. మ‌ణిశ‌ర్మ సంగీతంలోని పాట‌లు కానీ, నేప‌థ్య సంగీతం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రాజ్‌.కె.న‌ల్లి సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. నిర్మాత కోడి దివ్య దీప్తి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆమె నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విశ్లేషణ:

‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ అంటూ వచ్చిన ఈ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ అండ్ ఫ్యూ లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి. కానీ, సింపుల్ స్టోరీ, స్లో నేరేషన్ అండ్ బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :