ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాటా మహాసభలు... ఘనంగా మాతృదినోత్సవం

నాటా మహాసభలు... ఘనంగా మాతృదినోత్సవం

నాటా మహాసభల కార్యక్రమాల ప్రచారంలో భాగంగా నాటా ఆధ్వర్యంలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల మాతృదినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. నాటా మహిళా ఫొరం చైర్‌ సానపురెడ్డి స్వాతి అధ్యక్షత వహించి నిర్వహించిన వేడుకల్లో ఎంతోమంది పాల్గొన్నారు. విక్కీ మోస్‌ 3వ డిగ్రీ కనెక్షన్‌, డెరైక్టర్‌ ఆఫ్‌ కమ్యూనిటీ అండ్‌ ఇండస్ట్రీ సర్వీసెస్‌, కెన్యా మోబ్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌ మరియు డాక్టర్‌ నిషా ఉన్ని, హెమటాలజిస్ట్‌ అండ్‌ ఆంకాలజిస్ట్‌లతో సహా ముఖ్య అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నాటా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, నాటా మహాసభల కన్వీనర్‌ ఎన్‌ఎంఎస్‌ రెడ్డి, కోఆర్డినేటర్‌ డా. బుచ్చిపూడి రామిరెడ్డి, కో-కన్వీనర్‌ కోడూరు కృష్ణ, కో-ఆర్డినేటర్‌ గండికోట భాస్కర్‌, డిప్యూటీ కన్వీనర్‌ క్రిస్టపాటి  రమణరెడ్డి, సాంస్కృతిక లీడ్‌ చైర్‌ నాగిరెడ్డి దర్గా, క్రీడల చైర్‌ వీర్నపు సత్యం, నాటా డల్లాస్‌ ఆర్‌విపి వైశ్యరాజు మధుమతి, డేకోరేషన్‌ చైర్‌ మేకల అనురాధ, వెన్యూ చైర్‌ వేముల వీరారెడ్డి, రవాణా చైర్‌ పోలు రాజేంద్ర, వెబ్‌  చైర్‌ కొర్వి చెన్నా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాటా కన్వెన్షన్‌ మహిళా ఫోరం చైర్‌ స్వాతి సానపురెడ్డి, సలహాదారులు చింత ఉషా, శీలం కృష్ణవేణి, సహాధ్యక్షులు మరియు సభ్యులు పాలేటి లక్ష్మి, బెనకట్టి అను, కోటి కవితా, గౌని గాయత్రి, తిరుమలశెట్టి  సజిత, అట్లూరి స్వర్ణ, క్రలేటి సంధ్యా, కొమ్మూరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :