ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ద‌స‌రాలో హైలైట్ అదేన‌ట‌..!

ద‌స‌రాలో హైలైట్ అదేన‌ట‌..!

నాని హీరోగా వ‌స్తున్న తాజా చిత్రం ద‌స‌రా. నాని కెరీర్‌లోనే ఇది మొద‌టి పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ గా తెర‌కెక్కుతోంది. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. సంతోష్ నారాయ‌ణన్ ద‌స‌రాకు సంగీతమందిస్తున్నారు.

ఈ సినిమాలో నాని ఊర‌మాస్ లుక్ లో క‌నిపించ‌బోతున్న‌ట్లు మొద‌టి నుంచే అంద‌రికీ తెలుసు. కీర్తి సురేష్ నానికి జోడీగా న‌టిస్తుండ‌గా, స‌ముద్ర‌క‌ని, ప్ర‌కాష్ రాజ్, సాయికుమార్, రోష‌న్ మాథ్యూ, రాజేంద్ర ప్ర‌సాద్ ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

ఆ న్యూస్ ఏంటంటే, ద‌స‌రా సినిమాలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ఉంద‌ట‌. ఈ సినిమా మొత్తం గోదావ‌రి ఖని నేప‌థ్యంలోనే తెర‌కెక్కింది. అక్క‌డి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో ద‌స‌రా సినిమా ఉంటుందంటున్నారు. సినిమాలో బొగ్గు స్మ‌గ్లింగ్ చేసే విష‌యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంద‌ని, సినిమా మొత్తానికి ఈ ఫైట్ సీక్వెన్సే హైలైట్ గా నిలుస్తుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. 

పుష్ప సినిమాలో బ‌న్నీ దొంగ‌ల‌ను మాయం చేసే సీన్ మాదిరిగానే ఈ సీన్ ను కూడా డిజైన్ చేశార‌ని, ఈ సీన్ సినిమాలో బాగా వ‌చ్చింద‌ని తెలుస్తోంది. ద‌స‌రా సినిమా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల సినిమా మార్చి 31కు వాయిదా ప‌డింది. సినిమా ఫ‌స్ట్ లుక్ నుంచే సినిమా మీద మంచి బ‌జ్ ఉంది. అది టీజ‌ర్ రిలీజ్ అయ్యాక అమాంతం పెరిగిపోయింది. మొత్తానికి ద‌స‌రా సినిమా విష‌యంలో ప్ర‌తీదీ హైప్‌ను పెంచుతుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :