ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వెబ్ సిరీస్ లో 'చై' క్యారెక్టర్ ఇదేనా..?

వెబ్ సిరీస్ లో 'చై' క్యారెక్టర్ ఇదేనా..?

యంగ్ హీరో నాగ చైతన్య ఈ మధ్య వరుస ప్లాప్ లను ఎదుర్కొంటున్నాడు. అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన ' బంగార్రాజు ' సినిమా తర్వాత వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో అక్కినేని ఫాన్స్ కాస్త నిరాశపడ్డారు. తెలుగులో 'థాంక్యూ' , బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లు గా నిలిచాయి.

ప్రస్తుతం నాగ చైతన్య తమిళ దర్శకుడు విక్రమ్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ `కస్టడీ`లో నటిస్తున్నాడు. ఒకే సారి తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా, కృతిశెట్టి హీరోయిన్ గా చై తో జత కట్టనుంది. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది.

ఇదిలా వుంటే నాగచైతన్య డిజిటల్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్న విషయం తెలిసిందే. `దూత` పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ తో చై ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సిరీస్ ని విక్రమ్ కె. కుమార్ రూపొందిచగా, ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య ఎలా కనిపించబోతున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రేక్షకుల అంచనా ప్రకారం ఈ వెబ్ సిరీస్ లో చైతు జర్నలిస్ట్ గా కనిపించబోతున్నారు అని  తెలిసింది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శరత్ మరార్ ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ కోసం ఫేమస్ టెక్నిషియన్లు  పని చేస్తున్నారని చెబుతున్నారు.

పోలాండ్ కు చెందిన మిఖోలజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా న్యూయార్క్ కు చెందిన ఇషాన్ సంగీతం అందిస్తున్నారట. తెలుగులో పలు క్రేజీ సినిమాలకు వర్క్ చేస్తూ జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న నవీన్ నూలి ఈ సిరీస్ కు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారట. అత్యుత్తమమైన టెక్నికల్ టీమ్ తో రూపొందుతున్న `దూత` చైకి ఓటీటీ  లో బిగ్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :