ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బే ఏరియాను షేక్‌ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌

బే ఏరియాను షేక్‌ చేసిన దేవిశ్రీ ప్రసాద్‌

తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన సంగీతంతో బే ఏరియావాసులను షేక్‌ చేశారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ద్వారా జూలై 22వ తేదీన ఏర్పాటు చేసిన దేవిశ్రీ సంగీత విభావరి సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌, తన టీమ్‌తో కలిసి తన పాటలతో సంగీతంతో అందరినీ ఆకట్టుకున్నారు. గాయనీ గాయకులు హేమచంద్ర, పృధ్వీ, సాగర్‌, మంగ్లీ, రీటా, మౌనిక  ఇంద్రావతి ఈ సంగీత విభావరిలో పాటలను పాడారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి అనసూయ యాంకర్‌గా వ్యవహరించారు. ఈ సంగీత విభావరికి దాదాపు 3,500 మందికిపైగా హాజరయ్యారు. ఖచ్చితంగా ఇటీవలి కాలంలో అత్యుత్తమ ప్రదర్శనలలో ఒకటిగా దీనిని చెప్పవచ్చు.  

మెలోడీ హిట్‌లతో  ప్రారంభమై, మాస్‌ డ్యాన్స్‌ లతో సూపర్‌ హిట్టయింది. పాటలకు అనుగుణంగా వచ్చిన ప్రేక్షకులు కూడా నృత్యం చేయడంతో హాలంతో కోలాహలంగా కనిపించింది.  కొరియోగ్రాఫర్‌లు దీప, శాండీ నేతృత్వంలోని రిషి డ్యాన్స్‌ అకాడమీ చేసిన నృత్యాలు కార్యక్రమంలో మరో హైలైట్‌ గా నిలిచాయి. ఈ నృత్యాలు, పాటలతో వచ్చిన ప్రేక్షకులంతా మంచి అనుభూతికి లోనయ్యారు. సాయంత్రం 7:00 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. విజయ ఆసూరి (బాటా సలహాదారు) అతిథులందరికీ సాదరంగా స్వాగతం పలికారు. బాటా ప్రెసిడెంట్‌ కొండల్‌ కొమరగిరి ఈ షోను సూపర్‌ హిట్‌ చేసిన వారందరికీ విజయవంతం చేసిన బాటా టీమ్‌ ను, వలంటీర్లకు ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా బాటా టీమ్‌ను ఆయన పరిచయం చేశారు.  

శివ కదా (వైస్‌ ప్రెసిడెంట్‌), వరుణ్‌ ముక్కా (సెక్రటరీ), హరి సన్నిధి (జాయింట్‌ సెక్రటరీ)
స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీదుల, కామేష్‌ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి
‘‘సాంస్కృతిక కమిటీ’’ సభ్యులు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి  
‘లాజిస్టిక్స్‌ టీమ్‌’ సురేష్‌ శివపురం, రవి పోచిరాజు, సందీప్‌ కె ఉన్నారు.
యూత్‌ కమిటీ - సంకేత్‌, ఉదయ్‌, ఆదిత్య, సందీప్‌, గౌతమి, హరీష్‌
‘సలహా సంఘం’ ప్రముఖులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ, కళ్యాణ్‌ కట్టమూరి, హరినాథ్‌ చీకోటి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా విజయవంతం చేసిన బాటా బృందాన్ని అభినందించారు.

శాన్‌ ఫ్రాన్సిస్కో కాన్సల్‌ జనరల్‌ డా. టి.వి. నాగేంద్ర ప్రసాద్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అద్భుతమైన, వినోదభరితమైన కార్యక్రమాన్ని రూపొందించినందుకు నిర్వాహకులను ప్రశంసించారు. పీపుల్‌ మీడియాకు చెందిన టిజి విశ్వ ప్రసాద్‌ (పీపుల్‌ మీడియా), బాటా టీమ్‌ కచేరీని నిర్వహించడంలో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

బాటా కార్యక్రమాలకు నిరంతర మద్దతు ఇస్తున్న గ్రాండ్‌ స్పాన్సర్‌ రియల్టర్‌ నాగరాజ్‌ అన్నయ్య, పవర్‌డ్‌ బై యు స్మైల్‌ డెంటల్‌, గోల్డ్‌ స్పాన్సర్‌లు మీలో యాప్‌ అండ్‌ స్ట్రైవ్‌ ఏవియేషన్‌ స్పాన్సర్‌లకు నిర్వాహకులు ధన్యవాదాలు  తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫుడ్‌ స్పాన్సర్‌గా కేక్స్‌ అండ్‌ బేక్స్‌ వ్యవహరించింది. 

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :