ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మరోసారి బైడెన్ ట్రంప్ మధ్యే పోటీ

మరోసారి బైడెన్ ట్రంప్ మధ్యే పోటీ

ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ల తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధికార డెమొక్రాట్ల అభ్యర్థిగా జో బైడెన్ పోటీ పడుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో నామినేట్ కావడానికి కావాల్సిన 1,968 మంది ప్రతినిధులను బైడెన్ సాధించారు. మరోవైపు ట్రంప్ సైతం నామినేట్ కావడానికి కావాల్సిన 1,215 మంది ప్రతినిధుల మద్దతు కూడ గట్టారు.మార్చి 12న డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు బైడెన్, ట్రంప్లు మెజారిటీ డెలిగేట్లను గెలుచుకోవడం ద్వారా నామినీలుగా మారారు, దీంతో ఈ ఇద్దరు తలపండిన రాజకీయ చాణక్యులు.. మరోసారి ఎన్నికల్లో తలపడనున్నారు.

ఏఏ రాష్ట్రాల్లో ఎవరు గెలిచారు?

రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో అలబామా, అర్కాన్సాస్, మైనే, నార్త్ కరోలినా, ఓక్లహోమా, టేనస్సీ, టెక్సాస్, వర్జీనియా సహా 14 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. వెర్మోంట్‌లో నిక్కీ హేలీ విజయం సాధించారు. డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో వర్జీనియా, అయోవా, నార్త్ కరోలినా, వెర్మోంట్, కొలరాడో, ఓక్లహోమా, టేనస్సీ, టెక్సాస్, అర్కాన్సాస్, మైనే, మసాచుసెట్స్, అలబామాలో బైడెన్ గెలిచారు. డెమోక్రటిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బైడెన్‌తో పాటు మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌ తలపడ్డారు. అయితే..రిపబ్లికన్ అభ్యర్థిగా బైడెన అర్హత సాధించారు.

రిపబ్లికన్ల తరపున ట్రంప్, నిక్కీహేలీ, ఫ్లోరిడా మాజీ గవర్నర్ రాన్ డీ శాంటిస్, అర్కానాస్ మాజీ గవర్నర్ అసా హచిన్సన్, ఎంటర్ ప్రెన్యూర్ వివేక్ రామస్వామి తదితరులు పోటీ పడ్డారు. ఒకొక్క ప్రైమరీ ఫలితం విడుదలవుతున్న కొద్దీ ఒకొక్కరుగా తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్నారు. అయితే నిక్కీ హేలీ మాత్రం తుదకంటా ట్రంప్ తో పోటీ పడ్డారు. సూపర్ ట్యూస్ డే ఫలితాల తర్వాత నిక్కీ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు.టెక్సాస్, వర్జీనియా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో బైడెన్ విజయ దుంధుబి మోగించారు.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ ...

ఈ ఇద్దరు అధ్యక్షులు గతంలో తాము ఇచ్చిన నినాదాలనే మళ్లీ వల్లెవేస్తున్నారు. ట్రంప్.. గత ఎన్నికల్లో అమెరికా ఫస్ట్ నినాదమిచ్చారు. అమెరికాను అగ్రపథాన నిలబెడదామంటూ ప్రజల్లోకి వెళ్లారు.ఇప్పుడు కూడా అమెరికా ఫస్ట్ నినాదమిస్తున్నారు ట్రంప్. అయితే గత ఎన్నికల్లో ట్రంప్ ను గెలిపించని అమెరికన్ ఓటరు ఇప్పుడెలా స్పందిస్తారన్నది ఆసక్తి కలిగిస్తోంది.

మరోవైపు జో బైడెన్.. అమెరికాకు భద్రమైన భవిష్యత్ అందించాలన్నదే తన ధ్యేయమంటున్నారు. ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించేందుకు అనుమతించమంటున్నారు. 'ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఇప్పుడు ఓటర్ల ముందు ఉంది. ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడతారా? లేదా దాన్ని కూల్చివేసేందుకు ఇతరులకు అనుమతి ఇస్తారా? మన స్వేచ్ఛను, భ్రదతను కాపాడుకునే హక్కును పునరుద్ధరిస్తారా? లేదా వాటిని లాక్కునేవారికి అవకాశమిస్తారా?' అని జార్జియాలో విజయం తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్‌ అన్నారు.

ట్రంప్ తో పెనుముప్పు :బైడెన్

నాలుగేళ్ల క్రితం తాను విజయం సాధించిన నాటి కన్నా ట్రంప్ విసురుతున్న ముప్పు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉందని బైడెన్ హెచ్చరించారు. ఈ సమయంలో తన పార్టీపై, తనపై ఈ దేశాన్ని నడిపించడానికి మరోసారి విశ్వాసం ఉంచాలన్నారు.ఇక తాము అధికారం చలాయించిన ఈ అయిదేళ్లలో అమెరికాలో రికార్డు స్థాయిలో ఉద్యోగాల కల్పన, జీతాల పెంపు, డ్రగ్స్ వినియోగం తగ్గేలా చూడడం వంటి వాటిని తన విజయాలుగా అమెరికా ప్రజలకు జో బైడెన్ వివరించనున్నారు. ట్రంప్ ప్రచారశైలిని బట్టి బైడెన్ ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే :ట్రంప్..

ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తాను తొలుత చేసే పనులేంటో దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. 2021లో వాషింగ్టన్‌ క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి ఘటనలో అరెస్టయి జైళ్లలో ఉన్నవారిని వెంటనే విడుదల చేస్తానని, మెక్సికోతో సరిహద్దును మూసేసి అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు.

సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ తాజాగా ఒక పోస్టు పెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జో బైడెన్‌ గెలుపు అక్రమమని ట్రంప్‌ ఒక ప్రసంగం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న వాషింగ్టన్‌లోని చారిత్రాత్మక క్యాపిటల్‌ హిల్‌ భవనంపై దాడి చేశారు. ఈ కేసులో వందల మంది అరెస్టయి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. క్యాపిటల్‌ హిల్‌ తిరుగుబాటు కేసులో అధ్యక్షునికి రాజ్యాంగ రక్షణ ఉంటుందా లేదా అనే కేసులో ట్రంప్‌పై వచ్చే ఏప్రిల్‌ 25న అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయంటే..?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సాధారణంగా, ప్రతీ నాలుగు సంవత్సరాలకు, నవంబర్ 5 వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అంటే, ఈ సంవత్సరం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా దాదాపు 7 నెలల సమయం ఉంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024 నవంబర్ 5 మంగళవారం జరగనున్న 60వ చతుర్ముఖ అధ్యక్ష ఎన్నికలు. ఓటర్లు నాలుగు సంవత్సరాల కాలానికి అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ సభ్యుడైన మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఇది అమెర్ లో ఏడవ అధ్యక్ష ఎన్నికలను సూచిస్తుంది.2025 జనవరి 20న ఈ ఎన్నికల్లో విజేత ఎవరనేది తేలనుంది. అమెరికా సెనేట్, హౌస్, గవర్నర్, స్టేట్ లెజిస్లేటివ్ ఎన్నికల సమయంలోనే ఇది జరుగుతుంది.

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హతలు:

ఒక వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే ఆ వ్యక్తి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. సదరువ్యక్తి యునైటెడ్ స్టేట్స్ పౌరుడై ఉండాలి, కనీసం 35 సంవత్సరాల వయస్సు ఉండాలి మరియు కనీసం 14 సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్ నివాసి అయి ఉండాలి. 22వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎవరైనా రెండుసార్లు కంటే ఎక్కువసార్లు అధ్యక్షుడిగా ఎన్నిక కాకూడదు. ప్రధాన పార్టీ అభ్యర్థులు పార్టీ జాతీయ స్థాయిలో అభ్యర్థిని ఎన్నుకునే ప్రతినిధులను ఎన్నుకునే వరుస ప్రాథమిక ఎన్నికల ద్వారా నామినేషన్ కోరతారు. నవంబరులో జరిగే సాధారణ ఎన్నికలు ఒక పరోక్ష ఎన్నికలు, దీనిలో ఓటర్లు ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుల స్లేట్ కు ఓటు వేస్తారు; ఈ ఓటర్లు నేరుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.

కొలరాడో సుప్రీం కోర్టు, ఇల్లినాయిస్ లోని స్టేట్ సర్క్యూట్ కోర్టు, మరియు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైనే... జనవరి 6 క్యాపిటల్ దాడిలో పాత్ర పోషించినందుకు యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణలోని సెక్షన్ 3 ప్రకారం పదవిలో ఉండటానికి ట్రంప్ అనర్హుడని తీర్పునిచ్చాయి., అందువలన బ్యాలెట్ లో హాజరు కాకుండా ఆయనను అనర్హులుగా ప్రకటించడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ, మార్చి 4 న, యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా ఓ సంచలన తీర్పునిచ్చింది.ఒక జాతీయ ఎన్నికలకు అర్హతను రాష్ట్రాలు నిర్ణయించలేవని తీర్పులో స్పష్టం చేసింది.

70 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత...

సుమారు ఏడు దశాబ్దాల తర్వాత ఆసక్తికర ఘట్టానికి అగ్రరాజ్యపు అధ్యక్ష ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. వరుసగా రెండోసారి కూడా.. అధ్యక్ష ఎన్నికల్లో అదే ఇద్దరు అభ్యర్థులు తలపడబోతున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున జో బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌.. నవంబర్‌ 5వ తేదీన జరగబోయే 60వ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

1952, 1956 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫు అభ్యర్థి డ్వైట్ D. ఐసెన్‌హోవర్.. మాజీ ఇల్లినాయిస్‌ గవర్నర్‌(డెమొక్రటిక్‌) అడ్లై స్టీవెన్సన్‌ను రెండుసార్లూ ఓడించారు. తొలిసారి కంటే కంటే రెండో దఫా అధ్యక్ష ఎన్నికల్లో ఐసెన్‌హోవర్‌ మెరుగైన ఫలితంతో ఘన విజయం సాధించారు. అధ్యక్ష అభ్యర్థిని ఎంచుకోవడానికి, పరోక్ష ఎన్నికలు(ప్రైమరీ) నిర్వహించడం అక్కడ ఆనవాయితీ. ఇక్కడ ఓటర్లు ప్రతి పార్టీ తరఫున కొంతమంది ప్రతినిధుల్ని నిర్ణయిస్తారు. ఆపై ఈ ప్రతినిధులు తమ తమ పార్టీల అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ప్రైమరీలలో.. పార్టీ అధ్యక్ష నామినేషన్‌ను గెలవడానికి అభ్యర్థులకు సమావేశంలో ప్రతినిధుల ఓట్లలో మెజారిటీ అవసరం. అయితే.. నాలుగేళ్లకొకసారి అమెరికాలో జరిగేవి ప్రత్యక్ష ఎన్నికలే. అంతిమంగా బరిలో నిలిచే ఇరు పార్టీల అభ్యర్థులకు ఓట్లేసేది మాత్రం ప్రజలే.

సూపర్ ట్యూస్ డే అంటే ఏమిటి?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. ఇందుకోసం రాష్ట్రాలలో ప్రైమరీ, కాకస్ ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 5వ తేదీన గరిష్టంగా 16 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించారు. భారీ స్థాయిలో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించిన నేపథ్యంలో అందుకే దీనిని సూపర్ ట్యూస్‌డే అని పిలుస్తారు. అధ్యక్ష ఎన్నికల దృక్కోణం నుంచి ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజున పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తమ అభ్యర్థులను ఎన్నుకుంటారు. ఈ రోజుతే దాదాపు అభ్యర్థి ఎవరు అనేది తెలిసిపోతుంది.

'అయోవా కాకస్' అంటే ఏమిటి?

అమెరికాలో రెండు ప్రధాన పార్టీలుగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల ముందు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థిని ఎంపిక చేసేందుకు అంతర్గతంగా ఓటింగ్ నిర్వహిస్తాయి. దీన్నే 'కాకస్' అంటారు. అన్ని రాష్ట్రాల్లో ఓటు జరిగిన తర్వాత.. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని , జాతీయ సమావేశం నిర్వహించి.. తమ అధ్యక్ష అభ్యర్థిని పార్టీలు ప్రకటిస్తారు. ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన మొదటి 'కాకస్' ఎన్నిక.. అయోవా రాష్ట్రంలో జరిగింది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. ఇతర రాష్ట్రాలలోనూ వేర్వేరు తేదీల్లో ఇలాంటి కాకస్‌లు నిర్వహిస్తారు. జులైలో జరిగే రిపబ్లికన్ పార్టీ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారు.

నేను గెలవకుంటే రక్తపాతమే అన్న ట్రంప్..

అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒహియోలోని డేటన్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ర్యాలీలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నేను ఇప్పుడు ఎన్నిక కాకపోతే, ఇక్కడ రక్తపాతం జరుగుతుందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చిన సమయంలో అమెరికాలో ఆటోమొబైల్ పరిశ్రమపై ఫిర్యాదు చేశారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ ప్రజలను ఉద్దేశించి తాను తిరిగి ఎన్నికైతే యుఎస్‌లో చైనా దిగుమతి వాహనాలను విక్రయించదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించకపోతే అమెరికన్ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. 2020 ఎన్నికల్లో డెమొక్రటిక్ ప్రెసిడెంట్ జో బైడెన్‌ ఎన్నికల మోసం కారణంగానే తాను ఓడిపోయానని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఒకవేళ తాను ఎన్నికల్లో ఓడిపోతే.. దేశంలో మరో ఎన్నికలు వస్తాయో లేదోనని డౌటన్‌లో బహిరంగ ప్రసంగం సందర్భంగా ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి నా అవసరం ఉందని, నేను గెలవకపోతే రక్తస్నానం, రక్తనదులు ప్రవహిస్తాయని అన్నారు.

అమెరికాచరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ : ట్రంప్

ప్రైమరీ ఎన్నికల సందర్భంగా తన మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. గత మూడేళ్లలో అమెరికా దేశం ఘోర పరాజయాలను చవిచూసిందన్నారు. తాను పదవిలో ఉండి ఉంటే, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగేది కాదన్నారు. ఇజ్రాయెల్‌ వివాదం వచ్చేది కాదన్నారు. వలసలను అరికట్టేవాడినని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ను దేశ చరిత్రలో చెత్త అధ్యక్షుడిగా ట్రంప్ అభివర్ణించారు.

ట్రంప్ పై పలు నేరాభియోగాలు..

మాజీ అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వహించిన డొనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు వేర్వేరు క్రిమినల్‌ కేసుల్లో తన నేరారోపణలను ఎదుర్కొంటున్నాడు. మాజీ అమెరికన్‌ అధ్యక్షుడు రిపబ్లికన్‌లలో తన ప్రజాదరణను పెంచుకోవడానికి, అలాగే అవసరమైన నిధులను సేకరించడానికి తన శక్తిమేరకు ప్రయత్నిస్తున్నాడు. మళ్లీ ఎన్నికైతే, తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటానని ట్రంప్‌ ప్రమాణం చేశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఇమ్మిగ్రేషన్‌ విధానాలను విధించడం వంటి ఇతర భారీ మార్పులను తీసుకు వస్తానని ట్రంప్‌ వాగ్దానం చేశాడు. ఒబామా కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను తొలగిస్తామని, చైనాతో వాణిజ్యంపై కఠిన ఆంక్షలు విధిస్తామని కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ప్రజలకు హామీ ఇస్తున్నాడు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడికి పాశ్చాత్య ప్రభుత్వాల ప్రతిస్పందనకు బైడెన్‌ నాయకత్వం వహించాడు. ఇజ్రాయిల్‌-పాలస్తీనా యుద్ధంలో ఇజ్రాయిల్‌కు మద్దతుగా నిలబడ్డాడు. అమెరికా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడానికి భారీ ఆర్థిక ఉద్దీపన కార్యక్రమాన్ని చేపట్టాడు. అయినప్పటికీ ఓటర్ల నుండి ఆశించినంతగా గుర్తింపు పొందలేకపోయాడు. బైడెన్‌ ఇమ్మిగ్రేషన్‌ పాలసీ రిపబ్లికన్లతో పాటు డెమొక్రాట్‌ల నుండి పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఆయన పాలనలో అమెరికా-మెక్సికో సరిహద్దు దగ్గర వలసదారులు రికార్డు స్థాయికి చేరుకున్నారు.

కీలకాంశంగా బైడెన్ వృద్ధాప్యం..

జో బైడెన్‌, ఇప్పటికే అమెరికా అధ్యక్ష పీఠంపై ఉన్నాడు. తన వయస్సు, పేలవమైన ఆమోదం రేటింగ్‌ల గురించిన ఆందోళనల మధ్య, పదవిలో మరో నాలుగు సంవత్సరాలు ఉండే సత్తువ ఉందని ఓటర్లను ఒప్పించేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నాడు. అయితే…ట్రంప్‌ను ఓడించగల ఏకైక డెమొక్రాటిక్‌ అభ్యర్థి అతనేనని బైడెన్‌ మిత్రపక్షాలు చెబుతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వయసు,జ్ఞాపకశక్తిపై దుమారం రేగుతోంది. బైడెన్‌ వయసుపై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ వయసు సమస్య న్యాయమైనదేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఈ సమస్య వైట్ హౌస్‌ దృష్టిలోనూ ఉందని హిల్లరీ క్లింటన్‌ చెప్పారు. వయసు కారణంగా బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.

మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విషయంలోనూ వయసు సమస్య ఉందన్నారు హిల్లరీ. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఇద్దరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. వయసు ఒక సమస్యేనని, అయితే ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు. అధ్యక్షుడిగా బైడెన్‌ మరోసారి ఎన్నిక కావాలని హిల్లరీ ఆకాంక్షించారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని కితాబిచ్చారు.

కాగా, బైడెన్‌ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఇటీవలే ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్‌ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్‌ ఖండించారు.

అమెరికన్ల ఓటును ప్రభావితం చేసే అంశాలు..

గర్భస్రావం చట్టం..

అమెరికాలో అబార్షన్ యాక్సెస్ అనేది ప్రచారంలో కీలక అంశంగా భావిస్తున్నారు. గర్భస్రావానికి అనుమతిపై ప్రభావం చూపిన రెండు ప్రధాన కోర్టు తీర్పుల తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. 2022 డాబ్స్ వర్సెస్ జాక్సన్ ఉమెన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయం, దీన్ని యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టు కొట్టివేసింది. అబార్షన్ చట్టాన్ని పూర్తిగా రాష్ట్రాలకే వదిలేసి, అబార్షన్ పై నిషేధం విధించింది.

డెమొక్రాట్లు ప్రధానంగా గర్భస్రావం ప్రాప్యతను ఒక హక్కుగా చూడటానికి మద్దతు ఇస్తారు. రిపబ్లికన్ రాజకీయ నాయకులు సాధారణంగా గర్భస్రావం యొక్క చట్టబద్ధతను గణనీయంగా పరిమితం చేయడానికి అనుకూలంగా ఉంటారు. ఏప్రిల్ 2023 నాటికి, రిపబ్లికన్-నియంత్రిత రాష్ట్రాలలో అధిక భాగం గర్భస్రావంపై దాదాపు పూర్తిగా నిషేధాలను ఆమోదించాయి, ఇది యునైటెడ్ స్టేట్స్ అంతటా "చాలావరకు చట్టవిరుద్ధం"గా మారింది. కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ ప్రకారం, అత్యాచారం లేదా గర్భస్రావం కోసం మినహాయింపులు లేకుండా గర్భస్రావంపై ప్రారంభ దశ నిషేధాలను కలిగి ఉన్న 15 రాష్ట్రాలు ఉన్నాయి.

మరో ముఖ్యాంశం సరిహద్దు భద్రత మరియు వలసలు

2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లకు సంబంధించి సరిహద్దు భద్రత, వలసలు ప్రధానమైన అంశాలని సర్వేలో తేలింది. 2023 మరియు 2024 లో మెక్సికోతో యునైటెడ్ స్టేట్స్ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశించిన వలసదారుల పెరుగుదల కనిపిస్తోంది. వలసదారుల ప్రవాహానికి ప్రతిస్పందనగా రిపబ్లికన్ నియంత్రిత రాష్ట్రాలైన టెక్సాస్, ఫ్లోరిడా బి.ల్లో... బహిష్కరణలను పెంచుతానని, అమెరికా సైన్యాన్ని సరిహద్దుకు పంపుతానని, ఐసీఈ నిర్బంధాలను విస్తరిస్తానని, సరిహద్దు భద్రతను నిర్వహించడానికి స్థానిక చట్ట అమలును నియమిస్తానని, కస్టమ్స్, బోర్డర్ పెట్రోలింగ్ నిధులను పెంచుతానని, దక్షిణ సరిహద్దులో గోడ నిర్మాణాన్ని పూర్తి చేస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. వెనిజులా, ఉక్రెయిన్, నికరాగ్వా, క్యూబా, హైతీ వంటి కొన్ని దేశాల నుండి వచ్చిన వలసదారులకు తాత్కాలిక రక్షణలు కల్పించే విధానాన్ని బైడెన్ ప్రభుత్వం చేపట్టింది.

ప్రజాస్వామ్యం

జో బైడెన్ ఈ ఎన్నికలను ప్రజాస్వామ్యం కోసం పోరాటంగా చిత్రీకరిస్తున్నారు, ఈ పోరాటంలో ప్రజాస్వామ్యమే గెలవాలంటున్నారు. ట్రంప్ లాంటి అతివాది గెలవడం.. అమెరికన్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటున్నారు బైడన్.

అమెరికా ఆర్థికపరిస్థితులు...

2024 ఎన్నికలకు ఆర్థిక అంశాలను ప్రధాన అంశంగా పేర్కొంటున్నారు. కోవిడ్-19 మహమ్మారి గణనీయమైన ఆర్థిక ప్రభావాలను మిగిల్చింది, ఇది ఇప్పటివరకు కొనసాగుతూ వస్తోంది. మహమ్మారి మరియు సరఫరా-చైన్ సంక్షోభంతో సహా సంఘటనల సంగమం కారణంగా 2021 లో అధిక ద్రవ్యోల్బణం కాలం ప్రారంభమైంది, ఇది తరువాత పర్యావరణ సంక్షోభం ద్వారా పెరిగింది.

విద్యా రుణమాఫీ..

బైడెన్ పాలనలో, అనేక రౌండ్ల విద్యార్థుల రుణ మాఫీ జారీ జరిగింది. బైడెన్ పెద్ద మొత్తంలో విద్యార్థుల రుణమాపీ ఆటోమేటిక్ గానే జరిగిపోతుందన్నారు బైడెన్.

విదేశాంగ విధానం

ప్రస్తుతం కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ఈ ఎన్నికల్లో ముఖ్యమైన అంశాలుగా భావిస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యన్ దండయాత్ర సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఉక్రెయిన్ కు గణనీయమైన సైనిక మరియు మానవతా సహాయాన్ని అందించింది. డెమొక్రటిక్ రాజకీయ నాయకులు మరియు గణనీయమైన సంఖ్యలో రిపబ్లికన్ రాజకీయ నాయకులు ఈ ప్రణాళికకు మద్దతు ఇచ్చారు, "ప్రోట్"లో యునైటెడ్ స్టేట్స్ గణనీయమైన పాత్రను పోషిస్తుందని వాదించారు.

ఆరోగ్య సమస్యలు

ఒబామాకేర్ గా పేరొందిన అఫర్డబుల్ కేర్ చట్టాన్ని రద్దు చేయడాన్ని 2024 ఎన్నికల్లో ట్రంప్ కీలక అంశంగా చేశారు. యునైటెడ్ స్టేట్స్ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మారాలా?,మరియు కోవిడ్-19 మహమ్మారితో సహా ఆరోగ్య సంరక్షణ మరియు ఔషధ విధానం యొక్క సమస్య 2024 అధ్యక్ష ఎన్నికలలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

2020 లో ఎల్జిబిటి వ్యతిరేక ఉద్యమం

ఇటీవలి సంవత్సరాలలో, రాష్ట్ర చట్టసభలలో కన్జర్వేటివ్ రాజకీయ నాయకులు ఎల్జిబిటి ప్రజల, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ ప్రజల హక్కులను పరిమితం చేసే బిల్లులను ప్రవేశపెట్టారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ స్వలింగ సంపర్కులు, కులాంతర వివాహాలకు రక్షణ కల్పించే రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ చట్టంపై సంతకం చేశారు.

అమెరికాకు మెక్సికో అధ్యక్షుడి వార్నింగ్..

మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడార్ అమెరికాకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు, అమెరికా అధికారులు తన డిమాండ్లను తీర్చకపోతే వలసదారుల తరంగాలు దక్షిణ సరిహద్దును దాటడం కొనసాగుతుందని హెచ్చరించారు.

చైనాతో అమెరికా బంధం..

అమెరికా ప్రయోజనాలు మరియు విలువలను రక్షించడానికి మా మిత్రదేశాలు మరియు భాగస్వాములతో కలిసి పనిచేసే బలమైన స్థానం నుండి యునైటెడ్ స్టేట్స్ పిఆర్సితో తన సంబంధాన్ని కొనసాగిస్తుంది. మేము మా ఆర్థిక ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాము, బీజింగ్ యొక్క దూకుడు మరియు బలవంతపు చర్యలను ఎదుర్కొంటాము, కీలక సైనిక ప్రయోజనాలు మరియు కీలకమైన భద్రతా భాగస్వామ్యాలను కొనసాగిస్తాము, ఐక్యరాజ్యసమితిలో బలంగా తిరిగి నిమగ్నమవుతామని బైడెన్ సర్కార్ చెబుతోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :