ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగంలో పెరిగిన పెట్టుబడులు

హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగంలో పెరిగిన పెట్టుబడులు

హైదరాబాద్‍ రియల్‍ ఎస్టేట్‍ రంగం ఇప్పటికీ పెట్టుబడిదారులకు ముఖ్య ప్రాంతంగా కనిపిస్తోంది. ఎంతోమంది తమ పెట్టుబడులను పెడుతున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి (క్యూ1) మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 922 మిలియన్‍ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు రాగా.. ఇందులో 41 శాతం అంటే 384 మిలియన్‍ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్స్ హైదరాబాద్‍ రియల్టీ రంగంలోకి వచ్చాయని జేఎల్‍ఎల్‍ నివేదిక వెల్లడించింది. ఫీనిక్స్ వంటి పలు నిర్మాణ సంస్థలు నగరంలో కొత్త అభివృద్ధి ప్రాజెక్ట్లు ప్రారంభించడమే ఈ వృద్ధికి కారణమని తెలిపింది. ఈ ఏడాది క్యూ1 ముంబైలోకి 193 మిలియన్‍ డాలర్ల ఇనిస్టిట్యూషనల్‍ ఇన్వెస్ట్మెంట్స్ రాగా.. ఢిల్లీ ఎన్‍సీఆర్‍లో 107 మిలియన్‍ డాలర్లు, పుణేలోకి 7 మిలియన్‍ డాలర్లు, ఇతర నగరాలన్నీ కలిపి 231 మిలియన్‍ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గతేడాది క్యూ1లో హైదరాబాద్‍లోకి 100 మిలియన్‍ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గతేడాది క్యూ1తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1లో ఇనిస్టిట్యూషనల్‍ ఇన్వెస్ట్మెంట్స్లో 21 శాతం వృద్ధి నమోదయింది. గతేడాది క్యూ1లో 763 మిలియన్‍ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 2021 క్యూ1లోని మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 94 శాతం కమర్షియల్‍ ఆఫీస్‍ స్పేస్‍ విభాగమే ఆకర్షించింది. ఇందులోకి 864 మిలియన్‍ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :