ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా.. పద్మరాజన్ రికార్డ్

ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా..  పద్మరాజన్ రికార్డ్

సుమారు 35 ఏళ్లుకు పైగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు అన్ని ఎన్నికల్లో ఓడిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్‌లోకి ఎక్కాడు. తన రికార్డ్‌లను పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడు తాజాగా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యాడు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన 65 ఏళ్ల కె పద్మరాజన్‌ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేసిన అతడు ఓటమిపాలయ్యాడు. అయినప్పటికీ తనకు గెలుపు ముఖ్యం కాదని ఎన్నికల్లో పోటీ చేయడమే ప్రధానమని చెబుతున్నాడు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని ధర్మపురి జిల్లా నుంచి పోటీకి సిద్ధమయ్యాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :