ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గ్రేటర్ రాయలసీమ వాసుల కోసం డల్లాస్ లో విస్తృతంగా సేవలు అందిస్తున్న గ్రాడా (GRADA)

గ్రేటర్ రాయలసీమ వాసుల కోసం డల్లాస్ లో విస్తృతంగా సేవలు అందిస్తున్న గ్రాడా (GRADA)

అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు అందిస్తున్నదని ఆ సంస్థ ప్రతినిధులు డాక్టర్ దర్గా నాగిరెడ్డి, చెన్నా కొర్వి, డాక్టర్ రాజేంద్ర ప్రోలు, మరియు డాక్టర్ శ్రీనాథ్ పలవల ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, ప్రకాశం, మరియు నెల్లూరు జిల్లాల నుండి వివిధ కారణాల రీత్యా అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి విచ్చేసిన విద్యార్థులు, ఉద్యోగులు, దంపతులు, పిల్లల కోసం గ్రాడా (GRADA) సంస్థ వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తున్నదని పేర్కొన్నారు. 

గ్రేటర్ రాయలసీమ విద్యార్థుల కోసం ఉద్యోగమేలాలు, మహిళా సాధికారత కోసం ఉమెన్ ఫోరం, వివాహం కోరుకునే యువతి యువకుల కోసం మాట్రిమోనీ, మొదలయిన సదుపాయాలు కల్పిస్తున్నదని తెలిపారు. గ్రేటర్ రాయలసీమ సంస్కృతిని కాపాడడం కోసం సంస్కృతిక కార్యక్రమాలు డల్లాస్ నగరంలో నిర్వహిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని పేర్కొన్నారు. ఇవే కాకుండా క్రీడలు, పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి కావలసిన అవగాహన కార్యక్రమాలు, వైద్య మరియు నేత్ర శిబిరాలు, ఆధ్యాత్మిక, రియల్ ఎస్టేట్ కు సంబంధించిన సమాచార ఎప్పటికప్పుడు అందించడం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. 

డల్లాస్ నగరంలో రాయలసీమ ప్రజల కోసం 150 మంది విరాళాలతో ప్రారంభమైన గ్రాడా (GRADA) సంస్థ రోజుకి రోజుకి తన సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ గ్రేటర్ రాయలసీమ తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని, డల్లాస్ వాసులు మరియు డల్లాస్ కి వచ్చేవారు గ్రాడా (GRADA) సంస్థ యొక్క సేవలను వినియోగించుకోవడానికి తమను www.gradaus.org ద్వారా సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

ఫిబ్రవరి 17న North Texas Food Bank వారి ద్వారా దాదాపు 500 మంది కి సరిపోయే ఆహారాన్ని గ్రాడా సభ్యులు పంచిపెట్టారు. మునుముందు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన డాలస్ వాసులకి GRADA నిర్వర్తించబోతున్నది. 

కార్యక్రమంలో ఆ సంస్థకు చెందిన సభ్యులు GRADA కుటుంబానికి చేయూతనిస్తున్న మన గ్రేటర్ రాయలసీమ వాసులు, డాలస్ నివాసులు అయిన శ్రీధర్ బొమ్ము, బ్రహ్మ చీర, కార్తిక్ మేడపాటి, నంద కొర్వి, రమ్య నవీన్, హారిక కల్లే, జ్యోత్స్న అమృతం, మల్లికార్జున వేమన, శంకర్ ఓబిలి, ఉమా మహేశ్వర్ గొర్రెపాటి, శివ వల్లూరు, శివ పోతన్నగారి, జగదీష్ నందిమండలం, శ్రీని గాలి, ప్రభాకర్ మెట్ట, రతన్ అమృతం, కోటి గుడ్డేటి, మణికుమార్ సోమిశెట్టి, శివరాజు అద్దేపల్లి, హేమంత్ కాకుట్ల, భాను మితిరేవుల, సునీల్ జంపాల, హర్ష దళవాయి, మనోజ్ గుంటూరు, నాగరాజ్ గోపిరెడ్డి, సురేష్ మోపూరు, సుధాకర్ మేనకూరు, వరదరాజులు కంచం, అనిల్ కుమార్ కుంట, హరినాథ్ పొగాకు, ప్రసాద్ నాగారపు, నవీన్ కుమార్ రాజు అడ్లూరి, పవన్ మిట్ట, ప్రవీణ్ కుమార్ ఎద్దుల, పురుషోత్తం బోరెడ్డి, శ్రీనివాస ముక్క, శ్రీనివాసుల కొత్త, ఎల్లారెడ్డి చలమల, గౌతమ్ కాతెరగండ్ల, అనిత నాగిరెడ్డి, భాస్కర్ మస్నా, శ్రీకాంత్ కల్లే, ప్రశాంత్ మద్దిపట్ల, రమేష్ చిలమూరు… ఇంకా ఎందరో ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :