ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ: మెగాస్టార్ నటనే హైలెట్ గా 'గాడ్ ఫాదర్'  

రివ్యూ: మెగాస్టార్ నటనే హైలెట్ గా 'గాడ్ ఫాదర్'  

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు : కొణిదెల  ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్,
నటీనటులు: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరీ జగన్నాధ్, సత్య దేవ్, సముద్రఖని, మురళీ శర్మ, సునీల్, బ్రహ్మాజీ, ప్రభు దేవా స్పెషల్ అట్రాక్షన్, సంగీతం: థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
ఒరిజినల్ కథ: 'లూసిఫర్' మురళి గోపి, మాటలు: లక్ష్మి భూపాల్
పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ.,అనంతశ్రీరాం, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాతలు: రామ్ చరణ్, ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్
దర్శకత్వం : మోహన్ రాజా, విడుదల తేదీ : 05.10.2022

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్, ప్రిథ్వి రాజ్ నటించిన లూసిఫర్ మూవీ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబినేషన్‌లో గాడ్‌ఫాదర్ చిత్రం దసరా కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆచార్య చిత్రం డిజాస్టర్ తర్వాత ఈ సినిమా వస్తుండటంతో మెగా అభిమానులు భారీగా ఆశలు పెట్టుకొన్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్‌లో నటించడంతో అంచనాలు రెండింతలు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన గాడ్‌ఫాదర్ చిత్రం అభిమానులకు, ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచిందనే విషయాన్ని తెలుసుకోవాలంటే..రివ్యూ చూద్దాం  

కథ:

రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీకేఆర్ (సర్వదమన్ బెనర్జీ) కొడుకు బ్రహ్మ (చిరంజీవి), తక్కువ సమయంలోనే రాష్ట్రంలో బలమైన వ్యక్తిగా ఎదుగుతాడు. అయితే, చిన్న తనం నుంచి పి.కె.అర్ కుమార్తె సత్యప్రియ (నయనతార) బ్రహ్మను ద్వేషిస్తూ ఉంటుంది.  తన తల్లికి జరిగిన అన్యాయంతో బ్రహ్మను కుటుంబానికి దూరంగా సత్యప్రియ పెడుతుంది. కుటుంబ విభేదాలు తీవ్రస్థాయిలో ఉండగా.. ముఖ్యమంత్రి పీకేఆర్ ఆకస్మిక మరణంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది. సీఎం పదవిని చేజిక్కించుకోవడానికి సీనియర్ నేతలు కుట్రలకు తెరలేపుతారు. ఈ పరిస్థితులను అవకాశంగా చేసుకొని సత్యప్రియ భర్త జయదేవ్ (సత్యదేవ్) సీఎం పదవిని చేపట్టేందుకు కుట్ర పన్నుతాడు. దాంతో తన భర్తను ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అనే నేపథ్యంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య బ్రహ్మ ఏం చేశాడు ? బ్రహ్మ గాడ్ ఫాదర్ ఎలా అయ్యాడు?   అతని గత జీవితం ఏమిటి? ఈ మధ్యలో మసూన్ భాయ్ (సల్మాన్ ఖాన్) పాత్ర ఏమిటి ?, చివరకు బ్రహ్మ ఎవర్ని ముఖ్యమంత్రిని చేశాడు? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాంల్సిందే!  

నటి నటుల హావభావాలు:

మెగా స్టార్ చిరంజీవి నటన, ఫెర్ఫార్మెన్స్, యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. బ్రహ్మ పాత్రలో తన నట విశ్వరూపం తో విజృభించారు. ఇంకా అదే జోష్, గ్రేస్, యాటిట్యూడ్, లుక్‌తో ఇరగదీశాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అలాగే క్లైమాక్స్ లో తీవ్రమైన భావోద్వేగాలను పండించిన ఆయన నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ఇక చిరంజీవి తర్వాత ఆ రేంజ్‌లో విలన్ పాత్రలో నటించిన సత్యదేవ్, నయనతార, పోటీపడి మరి నటించారు. సల్మాన్ ఖాన్ సినిమాకు మరింత క్రేజ్, గ్రేస్‌ను తెచ్చిపెట్టాడు. మాస్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాడు. సునీల్, బ్రహ్మాజీ , దివి వద్యా ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్. తన చుట్టూ తిరిగే కథలో తన పాత్రకు సంబంధించి తన్యా రవిచంద్రన్ మెచ్యురిటీని ప్రదర్శించింది. మురళీమోహన్, అనసూయ మిగితా పాత్రల్లోని వారు వందకు వందశాతం న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

తెలుగులో హనుమాన్ జంక్షన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన  మోహన్ రాజా తొలి చిత్రం తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ ఇన్నాళ్లకు గాడ్‌ఫాదర్‌ చిత్రంతో అభిమానులకు ఫుల్ మీల్స్‌లా అందించడంలో అద్బుతమైన ప్రతిభను చాటుకొన్నాడు. మాతృక  లూసిఫర్ ఛాయలు ఎక్కడా కనపడకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అద్బుతమైన స్క్రీన్ ప్లేతో గాడ్‌ఫాదర్‌ను అన్ని వర్గాలను ఆకట్టుకొనే విధంగా రూపొందించాడు. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, మాస్, కమర్షియల్ అంశాలను చక్కగా డీల్ చేశాడు. ఎమోషనల్ సన్నివేశాల చిత్రీకరణ, బిల్డప్ షాట్స్, క్లైమాక్స్ అద్బుతంగా డీల్ చేశాడు. స్టైలిష్ మేకింగ్‌తో చిరంజీవిని కొత్తగా చూపించడంలో డిస్టింక్షన్ సాధించారని చెప్పవచ్చు. తమన్ తన మ్యూజిక్‌తో బాక్సుల బద్దలు చేసే బీజీఎం ఇచ్చారు. పలు సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడిచే విధంగా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తార్ మార్ టక్కర్ మార్ పాట సినిమాకు హైలెట్.. ఫ్యాన్స్‌కు కొత్త ఎనర్జీని ఇచ్చింది. నీరవ్ షా సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంది. సన్నివేశాల్లో ఎమోషన్స్ నింపడానికి వాడుకొన్న లైటింగ్ బాగుంది. ఎడిటింగ్, ఇతర విభాగాలు అన్ని పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాను మరింత రిచ్‌గా, నటీనటుల ఎంపిక ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ జోన్‌లోకి తీసుకు రావడానికి దోహదపడ్డాయి.

విశ్లేషణ:

తెలుగు ప్రేక్షకులకు ఈ కథ కొత్తేమి కాదు. తెలిసిన కథను తెర మీద కన్నార్పకుండా తెరకెక్కించడంలో మోహన్ రాజా టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ వ్యాల్యూస్, పాలిటిక్స్ లాంటి అంశాలతో రూపొందిన చిత్రం గాడ్‌‌ఫాదర్. కానీ లక్ష్మీభూపాల డైలాగ్స్ తుటాల మాదిరిగా పేలాయి. అంచనాలకు రెండింతలు మించి లక్ష్మీ భూపాల తన మాటలతో అభిమానుల కడుపు నింపేశాడని చెప్పవచ్చు. గాడ్ ఫాదర్ లో  మెగాస్టార్ చిరంజీవి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. నయనతార, సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి ప్లస్ అయ్యారు. కానీ కొన్ని చోట్ల స్లో నేరేషన్, బోరింగ్ సీన్స్ వంటి అంశాలు వున్నా అంతగా పట్టించుకోనవసరం లేదు. ఓవరాల్ గా దసరా పండుగ రోజున వచ్చిన ఈ చిత్రం అభిమానులకు దసరా,  దీపావళీ పండుగలు ఒకే సారి జరుపుకున్నట్లు అనుభూతిని నింపింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :