ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు క్రెడాయ్ భరోసా

తెలంగాణలో భవన నిర్మాణ కార్మికులకు క్రెడాయ్ భరోసా

రాష్ట్రంలో నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికులను కాపాడుకునేందుకు క్రేడాయ్‍ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న వలస కార్మికుల బాగోగులు చూసుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వలస కార్మికులందరికీ కరోనా టీకాలు వేయించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవటంతో కార్మికుల సంక్షేమంపై ద•ష్టి పెట్టింది.కరోనా భయంతో పనులు చేయలేని కార్మికులందరికీ ఆశ్రయం కల్పించటం, వారికి భోజనవసతులు సమకూర్చాలన్న అభిప్రాయంతో ఉంది. గత ఏడాది కరనో ప్రభావంతో స్థిరాస్తి రంగం తీవ్రంగా నష్టపోయింది. మరోసారి అటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇక కోలుకోలేమని బిల్డర్లు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కోవిడ్‍ కట్టడికి ప్రస్తుతానికి కర్ఫ్యూ మాత్రమే విధిస్తుండటంతో రియల్‍ ఎస్టేట్‍ రంగం బిల్డర్లు ఊరటపడుతున్నారు. దీనివల్ల నిర్మాణ పనులకు ఆటంకం కలగలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిర్మాణ పనులను ముగిస్తున్నారు. అయితే ఇటు కూలీలను, అటు బిల్డర్లను లాక్‍డౌన్‍ వార్తలు మాత్రం భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రెడాయ్‍ నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. రాష్టప్రభుత్వం కూడా తమకు అండగా నిలవాలని కోరుతోంది. రాష్ట్రంలో బిల్డింగ్‍ సెస్‍ సూమారు రూ.1500కోట్లవరకూ ఉందని , ఈ నిధులతో కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్టు క్రెడాయ్‍ ప్రతినిధులు వెల్లడించారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న వలస కార్మికులందరికీ కోవిడ్‍ వాక్సిన్‍ వేయనున్నట్టు ప్రకటించింది. రెండు విడతలుగా వ్యాక్సినేషన్‍ ద్వారా కార్మికులను కాపాడుకునేదిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వరాష్ట్రం, పరాయి రాష్ట్రం అన్న తేడా లేకుండా అర్హతగల వారందరికీ కరోనా వాక్సిన్‍ కార్యక్రమం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. అంతే కాకుండా వన్‍ నేషన్‍ వన్‍ రేషన్‍ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదినుంచే అమల్లో పెట్టింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మిక కుటుంబాలు తమ వద్ద వారి రాష్ట్రానికి చెందిన రేషన్‍ కార్డు ఉంటే వాటిని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపయోగించుకుని డీలర్ల ద్వారా తాము ఉన్న ప్రాంతంలోనే రేషన్‍ పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్‍మిల్లుల్లో పనిచేసే కార్మికుల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యేక సూచనలు ఇచ్చింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :