ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చేవెళ్ల త్రిముక పోరులో బీఆర్ఎస్ సపోర్టు ఎవరికో?

చేవెళ్ల త్రిముక పోరులో బీఆర్ఎస్ సపోర్టు ఎవరికో?

చేవెళ్ల లోక్‌సభ సన్నాహక సమావేశం సందర్భంగా ఎప్పుడు లేని విధంగా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు వైనం బయటపడింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో 17 లోకసభ స్థానాలకు గాను బీఆర్ఎస్ పార్టీ తమ వంతు కసరత్తు మొదలుపెట్టే క్రమంలో బిజీగా ఉంది. అందుకే సన్నాహాల కోసం సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే అనుకోకుండా ఇవాళ హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన చేవెళ్ల లోక్‌సభ సన్నాహ సమావేశం అనూహ్యమైన పరిణామాలకు దారి తీసింది.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి..ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి.. అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సమయంలో ఎమ్మెల్యే వర్గం అనూహ్యంగా నినాదాలు చేస్తూ అడ్డం పడింది. ఇక ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య జోరుగా మాటా మాటా సాగింది. విషయం చేయి దాటి పోయేలా ఉంది అని భావించిన మాజీ మంత్రి హరీష్ రావు మధ్యలో కలగజేసుకొని సర్దిచెప్పారు. దీంతో ఇరు వర్గాలు కాస్త శాంతించడంతో గొడవ సద్దుమణిగింది.

అసలు విషయం ఏమిటంటే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అప్పటి టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి గెలుపు సాధించాడు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి అదే తాండూరు నుంచి మహేంద్ర రెడ్డి పై విజయం సాధించాడు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల కాంగ్రెస్ గూటి నుంచి పైలెట్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటినుంచి 

బీఆర్ఎస్ పార్టీ లో తాండూరు సాక్షిగా వర్గ పోరు నడుస్తోంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు 2023 ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు కేసీఆర్ మహేందర్ రెడ్డి కి మంత్రి పదవి కట్టబెట్టారు.


తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి పార్టీ ఫిరాయించి వచ్చిన రోహిత్ రెడ్డికి బీఫామ్ ఇచ్చేశారు కేసీఆర్. అయితే పైలట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డి చేతిలో 6583 ఓట్ల తేడాతో పల్టీ కొట్టాడు. అయినా సరే ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం తో కాస్త ఫీలైన మహేందర్ రెడ్డి తన పూర్తి ఫోకస్ లోక్‌సభ స్థానంపై పెట్టాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన రోహిత్ రెడ్డి కూడా మరోపక్క చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఇప్పటివరకు అంతర్గతంగా జరుగుతున్న పోరు కాస్త తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహాల సమావేశంలో శిఖరాగ్రాన్ని చేరుకుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక్క లోకసభ సీట్ కోసం ఒకపక్క సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి..మరోపక్క మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి.. ఇంకో పక్క నుంచి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి .. ఈ ముగ్గురి మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బి ఫామ్ ఏ కాండిడేట్ కి ఇస్తారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :