ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

సీఏఏ చట్టం అమలుపైనా రాజకీయాలు...

సీఏఏ చట్టం అమలుపైనా రాజకీయాలు...

పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. విపక్షాలు ఎంతగా మొత్తుకుంటున్నా., ఎంతగా వ్యతిరేకిస్తున్నా .. మేం చేయాలనుకున్నాం.. చేసేశాం అన్నట్లుగా మోడీ సర్కార్ ప్రవర్తించింది. ఓ చట్టం ఎంత మంచిదైనా, లేదా ఇతరత్రా గుణాలున్నప్పటికీ.. దాన్ని ఎక్కువ పక్షాలువ్యతిరేకిస్తున్నాయంటే.. ఇంకా అందులో ఏవో లోపాలున్నట్లు అర్థం. అలాంటిది విపక్షం మొత్తం వ్యతిరేకిస్తోందంటే..దాన్ని పూర్తిస్థాయిలో చర్చించి, ఆపై వ్యతిరేకత వ్యక్తమైన అంశాలను మరోసారి సమీక్షించి, విపక్షాలతో పాటు నిపుణుల అభిప్రాయాలకు విలువనిచ్చి... ఆతర్వాతే దాన్ని అమల్లోకి తేవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్నది కూడా ఇదే.

అయితే మోడీ సర్కార్ మాత్రం .. తాను ఏది చేయాలనుకుంటుందో..దాన్ని హడావుడిగా చేసేస్తోంది. చాలా వరకూ అన్నీ సర్జికల్ స్ట్రైక్స్ లానే ఉంటున్నాయి. ఫలితంగా మోడీ సర్కార్ నిర్ణయాలన్నీ బుల్డోజ్ నిర్ణయాలుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇదిప్రజాస్వామ్యానికి మాత్రం మంచిది కాదని నిష్కర్శగా చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈరోజు మోడీ సర్కార్ అధికారంలో ఉంది. దాంతో తమకు ప్రజామోదం ఉందంటూ ఇష్టానుసారం నిర్ణయాలతో ముందుకెళ్తోంది. మరికొన్నేళ్లుపోయిన తర్వాత మరో పార్టీ పవర్ లోకి రావొచ్చు. అప్పుడేం అవుతుంది. ఆ పార్టీ కూడా తనకిష్టమైనట్లుగా నిర్ణయాలతో ముందుకెళ్తుంది. దీంతో ఎలాంటి సమస్యలు వచ్చినా.. ఫలితం మాత్రం దేశం అనుభవించాల్సి ఉంటుంది.

విపక్షాలు కూడా ఎప్పటికప్పుడు మోడీ సర్కార్ వలలో పడి.. అనుకున్నట్లుగా ముందుకెళ్లలేకపోతున్నాయి. కాలం మారింది.. రాజకీయాలుమారాయి. మారాయి అనడం కన్నా.. అప్ డేట్ అయ్యాయని చెప్పొచ్చు. అంతే కానీ.. ఎప్పుడో మాజీప్రధాని నెహ్రూ తరహా రాజకీయాలు చేస్తామంటే అది కుదురేపని కాదు. కానీ... దాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గుర్తించడం లేదు. రాహుల్ .. జోడోయాత్రతో కాంగ్రెస్ కు కాస్త ఊపు వచ్చింది. అయితే అధికారం సాధించేంత కాదు... ఎంతసేపు యాత్రలతో అధికారం సాధిస్తామన్నా అది జరగని పని . ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తే తప్పా, ఫలితం రాదు. ఇదే విషయాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అనుసరించిన విధానాలను చూసైనా రాహుల్ టీమ్ అర్థం చేసుకోవాలి.

ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వలస వచ్చే ఇతర మతస్తులు తమకు ప్లస్ అవుతారని కేంద్రం భావిస్తోంది. ఓరకంగా తమ ఓటు బ్యాంకు పెరుగుతుందని ఆశిస్తోంది. అయితే ఇదే సమయంలో ఇతర మతస్తులు వచ్చి, స్థానికంగా ఉండే ముస్లింలు, స్థానికులకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ చెబుతోంది. పలితంగా ఇరు పక్షాలు నువ్వా నేనా అన్నట్లుగా .. ఈవిషయంలో తలపడుతున్నాయి. కానీ దీని పరిణామం... కేవలం అసోం, బెంగాల్ పై అధికంగా ఉండనుంది. ఇతర రాష్ట్రాల ప్రజలకు మాత్రం దీనికంత రాద్దాంతమెందుకు అన్నట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :