ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు.. విరాళాల్లోనూ పోటాపోటీ

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు.. విరాళాల్లోనూ పోటాపోటీ

అమెరికా అధ్యక్ష పీఠం కోసం ప్రచారం జోరందుకుంది. ఎన్నికల బరిలో మరోసారి నిలిచిన అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారంతో పాటు, విరాళాలు సేకరించడంలోనూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. మార్చితో ముగిసిన త్రైమాసికం నాటికి తాము 192 మిలియన్‌  డాలర్ల నిధులను సేకరించినట్లు దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఎన్నికల ప్రచార కమిటీ వెల్లడించింది. ఇందులో ఒక్క మార్చి నెలలోనే 90 మిలియన్‌ డాలర్లు ( దాదాపు రూ.750 కోట్లు) పైగా విరాళాలను సమీకరించినట్లు తెలిసింది. వీటిలో 90 శాతం విరాళాలు 200 డాలర్ల లోపేనని వివరించింది.

మార్చి 28న రేడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌లో మాజీ అధ్యక్షులు ఒరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌తో కలిసి నిర్వహించిన కార్యక్రమంలోనే 26 మిలియన్‌ డాలర్లకు పైగా నిధులను సమీకరించినట్లు బైడెన్‌  బృందం వెల్లడించింది. మార్చి లో అధ్యక్షుడి కీలక స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగం తర్వాత 24 గంటల్లోనే 10 మిలియన్‌ డాలర్ల నిధులు అందినట్లు పేర్కొంది. మరోవైపు విరాళాల సేకరణలో డెమోక్రటిక్‌ పార్టీకి రిపబ్లికన్‌ పార్టీ గట్టి పోటీని అందిస్తోంది. ఒక కార్యక్రమంతోనే 50.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.420 కోట్లు ) సమీకరించినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార బృందం ప్రకటించింది. బైడెన్‌ బృందం రేడియో సిటీ మ్యూజిక్‌ హాల్‌ కార్యక్రమంలో సమీకరించిన దానితో పోలిస్తే ఇది రెండింతలు. త్రైమాసిక ముగిసే నాటికి తమ వద్ద 93.1 మిలియన్‌ డాలర్ల నిధులు ఉన్నట్లు ట్రంప్‌ బృందం వెల్లడించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :