ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

షారుఖ్ దీపికలని టార్గెట్ చేసిన నెటిజన్స్..

షారుఖ్ దీపికలని టార్గెట్ చేసిన నెటిజన్స్..

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీస్ ఏ చిన్న తప్పు చేసిన అడ్డంగా బుక్కవుతున్నారు. అక్షయ్ దగ్గరినుండి షారుఖ్ వరకు నెటిజన్స్ ఎవరినీ వదిలిపెట్టట్లేదు. రీసెంట్ గా బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ "వేదత్ మరాఠే వీర్ దౌదలే సాత్". ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసి దారుణంగా ట్రోలింగ్ కి గురైన విషయం తెలిసిందే.

తాజాగా బాలీవుడ్ క్రేజీ స్టార్స్ దీపికా పదుకునే షారుఖ్ ఖాన్ లు కూడా నెటిజన్ ల ట్రోల్ల్స్ కి బలైపోయారు. షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `పఠాన్`. ఈ సినిమాని సిద్ధార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేయగా, ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. 2023 జనవరి 23న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ `బేషరమ్ రంగ్` అనే బీచ్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు.

ఈ పాటలో దీపిక షారుఖ్ ల కెమిస్ట్రీ అదిరింది. ఇప్పటికే షారుఖ్ దీపికా జంటకి ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. షారుఖ్ నటించిన `ఓం శాంతి ఓం`తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దీపిక `చెన్నై ఎక్స్ ప్రెస్` హ్యాపీ న్యూఇయర్` సినిమాల తరువాత నాలుగవ సారి కలిసి నటిస్తున్న మూవీ ఇది. షారుక్ కూడా నాలుగేళ్ల విరామం తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఖాన్ అభిమానులు భారీగా అంచనాలు పెంచుకున్నారు.

ఇదిలా వుంటే తాజాగా విడుదల చేసిన సాంగ్ షారుఖ్ దీపికల కెమిస్ట్రీ అదిరిపోయిందని చెప్పాలి. ఈ పాటలో దీపిక బికినీలో అందాలు ఆరబోసింది .. ఒక విధంగా చెప్పాలంటే దీపిక చాలా వరకు షాకింగ్ క్లాత్స్ తో  సిజ్లింగ్ డ్యాన్స్ మూవ్స్ తో మతిపోగొట్టింది. అయితే ఈ పాటలోని ఎండింగ్ లో దీపిక ఆరంజ్ కలర్ డ్రెస్ లో కనిపించింది. ఇదే ఇప్పడు నెట్టింట ట్రోల్ కి గురయ్యేలా చేస్తోంది. ఈ డ్రెస్ లో వల్గర్ మూవ్స్ తో కనిపించిన తీరు నెటిజన్ లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

తనకంటే వయసులో పెద్ద వాడైనటువంటి షారుఖ్ తో దీపిక ఇలాంటి వల్గర్ భంగిమతో డ్యాన్స్ చేయడం కరెక్ట్ గా లేదని నెటిజన్ లు మండిపడుతున్నారు. ఏజ్ బార్ షారుఖ్ తో దీపిక ఇవేం వేశాలంటూ  సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ని మేకర్స్ ని ఏకి పారేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :