ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్టీఆర్‌కు పాటలతో నివాళులర్పించిన బాటా

ఎన్టీఆర్‌కు పాటలతో నివాళులర్పించిన బాటా

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా)  ప్రముఖ సినీనటుడు స్వర్గీయ ఎన్‌.టి.రామారావు శత జయంతి వేడుకలను పురస్కరించుకుని బే ఏరియా తెలుగు సంఘం(బాటా) ఆయనకు ప్రత్యేకంగా సంగీత నివాళులర్పించింది. పద్మవిభూషణ్‌ ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం, మ్యూజికల్‌ మేస్ట్రో పద్మవిభూషణ్‌ ఇళయరాజా పుట్టినరోజును పురస్కరించుకుని వారిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా సంగీత కార్యక్రమాన్ని నిర్వహించింది. బాటా కరవొకె మ్యూజికల్‌ గ్రూప్‌ గత 13 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తోందని ప్రసాద్‌ మంగిన పేర్కొంటూ ఈ వేదిక లక్ష్యం ప్రతిభావంతులైన గాయకులకు గుర్తింపు తీసుకురావడంతోపాటు, వారిని వేదిక ద్వారా అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొని అద్భుతమైన పాటలు పాడి శ్రోతలను అలరించిన గాయకులకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఆయన  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని బాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్వహించింది. కొండల్‌ కొమరగిరి(అధ్యక్షుడు), శివ కడ(వైస్‌ ప్రెసిడెంట్‌), వరుణ్‌ ముక్కా(సెక్రటరీ), హరి సన్నిధి(జాయింట్‌ సెక్రటరీ) స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మళ్ల, శిరీష బత్తుల, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి కల్చరల్‌ డైరెక్టర్స్‌ శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తి, నామినేటెడ్‌ కమిటీ సభ్యులు సురేష్‌ శివపురం, సుందీప్‌ కేదర్‌ సెట్టి, రవి పోచిరాజు, యూత్‌ కమిటీ సభ్యులు ఉదయ్‌, సంకేత్‌, ఆదిత్య, గౌతం, హరీష్‌, సందీప్‌, బాటా అడ్వయిజరీ బోర్డ్‌ సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ, కళ్యాణ్‌ కట్టమూరి, హరినాథ్‌ చికోటి తదితరులు కూడా కార్యక్రమం విజయవంతంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :