ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అలెక్సాతో చిన్నారిని కాపాడిన బాలిక.. జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా

అలెక్సాతో చిన్నారిని కాపాడిన బాలిక.. జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన నిఖిత(13) అలెక్సా సహాయంతో ఓ కోతి దాడి నుంచి తన అక్క కూతురిని రక్షించింది. కుటుంబ సభ్యులందరూ వేరే గదిలో ఉన్న సమయంలో ఆమె ఏడాది వయసు గల చిన్నారితో ఆడుకుంటుండగా ఓ కోతి ఆ ఇంట్లోకి దూరింది. పాపపై దాడిచేసేందుకు ప్రయత్నించగా, నిఖిత సమయస్ఫూర్తితో వ్యవహరించి ఫ్రిడ్జ్‌ పైన ఉన్న అలెక్సాకు కుక్కలా మొరుగు అంటూ ఆదేశాలిచ్చింది. అనంతరం అలెక్సా కుక్కలా మొరగడంతో ఆ అరుపులకు కోతి భయపడి పారిపోయింది. ఇలా కోతి బారి నుంచి తనతోపాటు తన అక్క కూతురిని కూడా ఆమె రక్షించుకుంది. ఈ విషయం తెలుసుకున్న మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా నిఖిత సమయస్ఫూర్తిని మెచ్చి ఆమెకు జాబ్‌ ఆఫర్‌ చేశారు. చదువు పూర్తయ్యాక నిఖిత కార్పొరేట్‌ ఉద్యోగం చేయాలనుకుంటే తాను ఇస్తానన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :